ఇస్మార్ట్ శంకర్ ‘ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మున్నా మైఖేల్ అనే హిందీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తరువాత సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ కి జోడిగా నటించి ఇస్మార్ట్ శంకర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా దెబ్బతో ఆమెకు టాలీవుడ్‌లో తిరుగులేని అవకాశాలు వచ్చాయి.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా వెంటనే ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్ లో ‘ ఈశ్వరన్ ‘సినిమా చేసింది. తమిళ్ స్టార్ హీరో శింబు ఈ సినిమాలో హీరోగా నటించాడు. శింబుతో ప్రేమాయణం నడుపుతోందన్న వార్తలతో నిధికి బోలెడంత పబ్లిసిటీ దక్కింది.
త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. దీనిపైన నిధి అగర్వాల్ ఎలాంటి రిప్లే ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే నిధి అగర్వాల్ తన అందం వెనకున్న సీక్రెట్ ని చెప్పింది. నిధి ఉదయం లేవగానే లెమన్ జ్యూస్ తాగుతుందట. ఆమె డైట్ లో తాజా పల్ల రసాలు తప్పకుండా ఉంటాయి.
అలాగే ప్రతిరోజు కావాల్సినంత మంచినీరు కూడా తాగుతానని.. టమాటో గుజ్జును చేతికి , వీళ్ళకి, అప్లై చేస్తానని. అలాగే కొంచెం పెరుగులో తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటానని చెప్పింది. దీంతో ముఖం నున్నగా కాంతివంతంగా మారుతుందంటూ తన బ్యూటీ సీక్రెట్ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.