తరతరాల నుండి సాధారణంగా పెద్దలు చేసే పెళ్లిలో భార్య వయస్సు తక్కువగా.. భర్త వయస్సు ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడైతే భార్యకు భర్తకు దాదాపు 10 నుంచి 16 ఏళ్ల ఏజ్ గ్యాప్ వరకు ఉండేది. ఇది కేవలం సాంప్రదాయమేనా? లేక ఏదైనా ఆరోగ్యపరమైన.. సాంఘిక పరమైన ఉపయోగాలు ఉన్నాయా? అనే దానిపై శాస్త్రాల వివరణ ఇలా ఉంది. ఆడవారి వయస్సు చిన్నగా ఉండడం వల్ల ముసలితనం వచ్చినప్పుడు ఆ భార్య భర్తకు సేవ చేయగలుగుతుంది.
ఒకవేళ భార్య పెద్ధది అయితే కనుక భర్తలు.. భార్యలు చేసినంత ఓపికగా సేవలు చేయలేరు. అలాగే ఆడపిల్లలు చిన్న వయసులోనే వయసుకు మించి ఆలోచించగలరు. వ్యవహరించగలరు. పురుషులు వారి వయసుకు తగ్గట్టు మాత్రమే ప్రవర్తించగలరు. మరొక కారణం తనకన్నా పెద్దవాడైన భర్త చనిపోతే తట్టుకుని నిలబడగలిగే శక్తి భార్యకు ఉంటుందట. కానీ భర్త అలా సంసారాన్ని ఈదలేడు. పురుషుని కన్నా స్త్రీకి సహనం ఎక్కువగా ఉంటుంది. భర్త కంటే భార్య వయస్సులో చిన్నదైతే ఇద్దరి ఆలోచనలు కూడా కలుస్తాయి. సంసారం ఆనందంగా సాగుతుంది.
ఒకే వయసు ఉన్న ఆడవారిని లేదా తమ కంటే పెద్దవారిని చేసుకోవడం వల్ల వారిద్దరి మధ్యన అభిప్రాయాలు కలవక అనేక రకాల సమస్యలు వస్తాయి అని సైంటిఫిక్ గా కూడా అబ్బాయి కంటే అమ్మాయి చిన్నదై ఉండాలి అని నిరూపించబడింది. ఇప్పుడిప్పుడే ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి జనాలు వయసు దృష్టిలో తీసుకోకుండా మనసుకు నచ్చిన వారిని వయసులో వారి కంటే పెద్దవారైనా సరే పెళ్లి చేసుకుంటున్నారు.