త‌మ్ముళ్లూ బ‌హుప‌రాక్‌.. ‘ యువ‌గ‌ళం ‘ లో లోకేష్ నిఘా ఎంత గ‌ట్టిగా ఉందంటే…!

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. అహ‌ర‌హం శ్ర‌మిస్తున్నారు. యాత్ర సాగుతున్న తీరును నిరంత‌రం ఆయ‌న స‌మీక్షించుకుంటు న్నారు. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి క్విక్‌గా త‌యారై.. వెంట‌నే సెల్ఫీ విత్ లోకేష్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఎంత మంది వ‌చ్చినా.. సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతంలో స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.

Will announce dedicate youth manifesto, says Nara Lokesh during 'Yuvagalam  Padayatra' in Andhra Pradesh | Amaravati News - Times of India

దీనిపై ప్ర‌త్యేకంగా నోట్స్ కూడా రాసుకుంటున్నారు. పైకి క‌నిపించేవి కొన్ని ఉంటే.. క‌నిపించ‌నవి ఈ యాత్ర‌లో చాలానే ఉంటున్నాయి. కొన్ని సామాజిక వ‌ర్గాల‌కు నారా లోకేష్ ఇచ్చిన హామీల‌ను త‌న డైరీలో ప్ర‌త్యేకంగా ఆయ‌న రాసుకుంటున్నారు. అదేవిధంగా యువ‌త‌కు ఏటా జాబ్ క్యాలెండ‌ర్, మ‌హిళ‌ల‌కు వ్య‌క్తిగ‌త రుణాలు, వ‌డ్డెర సామాజిక వ‌ర్గానికి ఎస్టీ హోదా.. వంటివాటిని మేనిఫెస్టోలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

Nara Lokesh suspends 'Yuva Galam Padayatra'- The New Indian Express

ఇక‌, సాయంత్రం పాద‌యాత్ర ముగించిన త‌ర్వాత‌.. శిబిరానికి చేరుకుని.. అక్క‌డే ఉన్నా.. రెస్ట్ తీసుకోకుం డా.. రోజంతా జ‌రిగిన పాద‌యాత్ర వివ‌రాల‌ను రాసుకుంటున్నారు. వాటినే మీడియాకు పంపిస్తున్నారు. అదే స‌మ‌యంలో పార్టీప‌రంగా యాక్టివ్‌గా ఉన్న నాయ‌కులు ఎవ‌రు.. ఎవ‌రెవ‌రు.. ఎంత సేపు యాత్ర‌లో పాల్గొంటున్నారు. ప్ర‌జ‌ల‌ను ఎలా మొబిలైజ్ చేస్తున్నారు? వంటి అన్ని విష‌యాల‌ను కూడా నారా లోకేష్ న‌మోదు చేసుకుంటున్నారు.

Nara Lokesh YuvaGalam Padayatra Day 24 in Srikalahasti Constituency Pipa  News - PiPa News

ఈ విష‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చింద‌ని భావించినా.. ఆయ‌న శిబిరానికి పిలిచి నాయ‌కుల‌ను ప్ర‌శ్నిస్తు న్నట్టు స‌మాచారం. అంతేకాదు.. ఇప్ప‌టి వర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించిన అనంత‌పురం, చిత్తూరు.. జిల్లాల్లో వైసీపీ లోటు పాట్లు, ఎమ్మెల్యేల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను కూడా అడిగి తెలుసుకున్నారు. త‌ద్వారా.. వారికి దీటైన అభ్య‌ర్థుల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున టికెట్‌లు ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. సో.. ఎలా చూసుకున్నా.. యువ‌గ‌ళం అంత ఆషామాషీగా అయితే.. నిర్వ‌హించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.