మన తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి పరిచయం చేయనవసరం లేదు. తనదైన నటనతో చిత్ర పరిశ్రమలో సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో కీర్తి సురేష్ అదరగొడుతుంది. రీసెంట్ గానే న్యాచురల్ స్టార్ నానితో కలిసి నటించిన దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కీర్తి సురేష్ ఏనాడు తన హద్దులు దాటలేదు. కానీ తొలిసారిగా మహేష్ తో కలిసి నటించిన సర్కారు వారి పాట సినిమాతో కాస్త హాట్ లుక్స్ లో నటించడానికి గ్లామర్ రోల్స్ చేయడానికి సై అంటుంది కీర్తి సురేష్. ఇదే సమయంలో ఒకటి మాత్రం అసలు చెయ్యనే చెయ్యను అంటుంది అదే లిప్ లాక్. అది కేవలం తన భర్తతో తప్ప వేరే ఈ హీరోతో అలాంటి సన్నివేశాలు చేయనని ఎంత క్యారెక్టర్ డిమాండ్ చేసిన అలాంటి సన్నివేశాలలో నటించనని.. ఆ సినిమా నుంచి తప్పుకుంటానంటూ చెప్పుకొస్తుంది.
రీసెంట్గా కోలీవుడ్‌లో నటిస్తున్న ఓ సినిమాలో కీర్తి సురేష్ ను నూ కథ డిమాండ్ చేయడంతో లిప్ లాక్ సీన్స్ చేయాలని డిమాండ్ చేశారట. అదే సమయంలో సినిమా నుంచి అయినా తప్పుకుంటాను కానీ ఆ సన్నివేశాల్లో చేయను అంటూ తెగ్గేసి చెప్పేసిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కీర్తి సురేష్ తీసుకున్న ఈ కమిట్మెంట్ కి అందరూ ఒక్కసారిగా ఫిదా అవుతున్నారు.