టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి వరుస సినిమాలతో బిజీ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ విలక్షణ దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ . తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్న కాజల్. ఆ తర్వాత చందమామ సినిమాతో మంచి విజయం అందుకుంది.
ఆ తర్వాత రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో వచ్చిన మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. రాజమౌళి దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో కాజల్ నటనతో పాటు అందంతోను అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతే కాకుండా కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసి అక్కడ కూడా విజయం అందుకుంది. ఈ సమయంలోనే కెరీర్ మంచి పిక్ స్టేజ్లో ఉండగానే ఈ బ్యూటీ పెళ్లాడి సినిమాలకు దూరమైంది.
ఇక ఇప్పుడు మళ్ళీ మరోసారి సినిమాలతో బిజీ కానుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ ఓ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు పలు ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు ఇచ్చింది. ఇక కాజల్ తన భర్త తన కొడుకు గురించి కూడా చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ఓ నెటిజన్ నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించాడు.. దానికి కాజల్ స్పందిస్తూ రెండున్నర సంవత్సరాల క్రితమే ఆ అదృష్టం మరొకరికి దక్కింది.. అంటు సరదాగానే సమాధానం ఇచ్చింది.
అలాగే కాజల్ ప్రస్తుతం కమలహాసన్ తో భారతీయుడు 2, బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో అల్లు అర్జున్ గురించి చెప్పమని ఓ అభిమాని అడగగా నాకు తెలిసిన మంచి వ్యక్తుల్లో అల్లు అర్జున్ ఒకరు.. ఆయన ఎనర్జీ ని నేను ఎంతగానో ఇష్టపడతానని కాజల్ చెప్పుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.