టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంతో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . కొన్నిసార్లు ట్రోలింగ్కి గురైతే .. మరికొన్నిసార్లు స్టార్ స్టేటస్ అందుకున్న పాన్ ఇండియా హీరోయిన్గా నెంబర్ వన్ పొజిషన్లో దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే సమంత పేరు అటు పాజిటివ్ గానూ ..ఇటు నెగటివ్ గానూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది .
ఇన్నాళ్లు నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసింది అన్న కారణంగా అక్కినేని అభిమానులు టృఓల్ చేస్తుంటే.. ఇప్పుడు సమంత విడాకులు తీసుకున్న కాని.. మెడలో నల్లపూసల దండ ధరించడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎస్.. సమంత నల్లపూసల దండ వేసుకున్న ఫోటోను ఆమె స్వయంగా షేర్ చేయడం ఇక్కడ గమనార్హం. అయితే సమంత నల్లపూసల దండ ఓ యాడ్ షూటింగ్లో భాగంగానే వేసుకుంది అంటూ తెలుస్తుంది .
సమంత తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో ఫోటో పంచుకుంది . ఈ ఫోటోలో సమంత మెడలో నల్లపూసలు దండ ధరించి ఉంది . అయితే జనాలు సమంత విడాకులు తీసుకుంది కదా..? మరి ఎందుకు నల్లపూసల దండ వేసుకుంది ..? రెండో పెళ్లి చేసుకుందా..? చెప్పకుండానే ఎలా చేసుకుంటుంది..? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఇది కేవలం ఆడ్ షూటింగ్లో భాగంగా వేసుకున్న నల్లపూసల దండే అంటూ తెలుస్తుంది. దీన్ని కింద సమంత ఎటువంటి క్యాప్షన్ ఇవ్వకపోవడంతో పుకార్లు ఊబందుకున్నాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సమంతా ఈ పోస్ట్ పై రెస్పాండ్ అయితేనే మంచిది అంటూ అభిమానులు సజెస్ట్ చేస్తున్నారు..!!