స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమా అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది ” దేశముదురు “. పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ తర్కెక్కించిన సినిమా కావడంతో అప్పట్లో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనుకున్న విధంగానే ఈ సినిమా రిలీజై ఇండస్ట్రీని ఒక ఊపుఊపింది.
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హన్సిక మోత్వాని దేశముదురు సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కించుకున్న హన్సిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దేశముదురు సినిమా షూటింగ్ టైంలో జరిగిన కొన్ని సన్నివేశాలను గుర్తు చేసుకుంది.
దేశముదురు సినిమా చేసే టైంకు తన ఏజ్ జస్ట్ 16 అని… అప్పటికే తాను కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినా.. రొమాంటిక్ సన్నివేశాలు నాకు కొత్తగా ఉండేవని చెప్పింది. అలాగే బన్నీ తో ఈక్వల్ గా డ్యాన్స్ స్టెప్స్ వేయడానికి చాలా కష్టపడ్డాను.. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో అల్లు అర్జున్ నాకు అన్నం తినిపించే షాట్ ఒకటి ఉందంటూ నాటి సంఘటన గుర్తు చేసుకుంది.
నాకు చిన్న చిన్న ముద్దలు తినడం అలవాటు.. అల్లు అర్జున్ ఒకేసారి పెద్ద ముద్దలు పెట్టడంతో అంత పెద్ద ముద్దలు నేను తినలేను అని చెప్తే.. నన్ను తిట్టి మరి పెద్ద పెద్ద ముద్దలు తినిపించాడని చెప్పుకొచ్చింది. మరో సన్నివేశంలో అల్లు అర్జున్‌ను హగ్ చేసుకోవాల్సి వచ్చింది.. ఆ సన్నివేశం నాకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదని.. దాంతో అల్లు అర్జున్ టక్కునే వచ్చి తల మీద ఒకటి పీకి మరి నన్ను హగ్ చేసుకున్నాడని ఆ ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంది.