యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తారక్ ప్రస్తుతం తన 30వ సినిమా దేవరను స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా టైటిల్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అంతే కాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.
ఇక సెకండ్ హీరోయిన్గా దిశా పటానీ లేదా మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి వస్తున్న ఒక్కో అప్డేట్ సోషల్ మీడియాలో లీక్ అవుతూ అభిమానుల్లో అంచనాలు పనిచేస్తుంది. కాగా దేవర సినిమా స్టోరీ చెప్పగానే కొరటాల శివకు ఎన్టీఆర్ ఒకే ఒక కండిషన్ పెట్టాడట. ఎన్టీఆర్ కొరటాలకు ‘నువ్వు ఏదైనా సరే అది నమ్మకంగా చేయి.. అప్పుడే నీకు అది విజయం ఇస్తుంది’.
‘ అంతేకానీ నిమిషానికి ఒక ఆలోచన మార్చుకుంటూ వెళ్తే మన చేసే పనిలో విజయం ఉండదు.. దానివల్ల ఎవరికీ లాభం ఉండదు. నీ గత సినిమా ఆచార్య లాగా నా సినిమాను చేయొద్దు అంటూ కొరటాలకు ఓపెన్న్ గానే క్లారిటీ ఇచ్చేసాడట తారక్ ‘ ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ చెప్పిన మాటలు నిజమే అని భావించిన కొరటాల ఆ కండిషన్ కి ఒప్పుకుని మరి దేవర సినిమాను కన్ఫామ్ చేసుకున్నారట.
ఇలా ఈ సినిమాతో హిట్ కొట్టేలాగానే కొరటాల కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం రాజమౌళి ట్రాక్ రికార్డు బ్రేక్ చేసినట్లే అంటున్నారు. మరీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి..!