జగపతి పిక్చర్స్ పతాకంపై.. ప్రస్తుత క్యారెక్టర్ ఆర్టిస్టు జగపతి బాబు తండ్రి అనేక హిట్ సినిమాలు చేశారు. ఆయనకు శోభన్‌బాబు అంటే చాలా ఇష్టం. శోభన్‌బాబుతో అనేక సినిమాలు చేశారు. కొన్ని కొన్ని సినిమా లను అయితే.. శోభన్‌బాబు కోసం నెలల తరబడి వేచే చూసి మరీ నిర్మించారు. ఇవన్నీ కూడా … చాలా బాగా హిట్టయ్యాయి. మనం ఒక విషయాన్ని గమనిస్తే.. తొలినాళ్లలో జగపతి బాబు హెయిర్ స్టయిల్ మొత్తం కూడా.. శోభన్‌బాబును పోలి ఉండేది.
ఇది.. జగపతిబాబుకు వాళ్లనాన్న చెప్పి మరీ చేయించిన హెయిల్ స్టయిల్‌గా ప్రచారంలో ఉండేది. అంత అనుబంధం.. శోభన్‌బాబుతో ఆయన పెంచుకున్నారు. అయితే.. దసరా బుల్లోడు సినిమా దగ్గరకు వచ్చేస రికి.. శోభన్ బాబుతోనే ఈ సినిమా చేయాలని అనుకున్నారు జగపతి బాబు తండ్రి వీ. బీ. రాజేంద్రప్రసాద్. ఈయన కూడా దర్శకుడే. అంతేకాదు.. దసరా బుల్లోడు సినిమాను ఈయనే దర్శకత్వం వహించారు. ఈయన కూడాచాలా పొదుపరి. ఆచి తూచి ఖర్చు చేసేవారు.
దసరా బుల్లోడు సినిమాకు నిన్ను అనుకుంటున్నాను.. అని శోభన్‌బాబుకు కబురు పెట్టారు. వాణిశ్రీ ఉందా? అని శోభన్‌బాబు అడిగారు. వారిమధ్య ఉన్న స్నేహాన్నిబట్టి ఆయన ఆరా తీశారు. ఉందని అన్నారు. అయితే.. రెమ్యునరేషన్ పెంచాను అని చెప్పారు. కానీ, రాజేంద్రప్రసాద్‌మాత్రం.. మా సినిమాలకు నేను ఎంత ఇస్తున్నానో అంతే ఇస్తాను అని చెప్పారు.
అయితే.. కుదరదని చెప్పారు.. శోభన్‌బాబు. దీంతో కొన్నాళ్ల పాటు ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం సాగినా.. చివరకు రాజేంద్రప్రసాద్ పంతానికి పోయి.. నువ్వు అడిగింది నేనినవ్వను..నేను ఇచ్చింది తీసుకోవాలని చెప్పారు. దీంతో ఆయన ఒప్పుకోలేదు. చివరకు.. ఈ కథ నచ్చి… అక్కినేని తన స్టూడియోలోనే సినిమాను చేయించారు.