చిరుతో పాటు ఫొటోలో ఉన్న ఈ మహిళ ఎవరో తెలుసా.. ఓ టాలీవుడ్‌ ప్రముఖ నటుడి భార్య..!

పైన కనిపిస్తున్న ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఒక మహిళ ఉండటం మీరు చూడవచ్చు. ఆమె భర్త సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. సెకండ్ హీరోగా మాత్రమే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్‌ ఆరిస్ట్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇప్పుడు అతను లేకుండా సినిమాలే రావడం లేదంటే అతిశయోక్తి కాదు. చాలా బిజీగా గడిపే ఈ నటుడు 35 ఏళ్ల నుంచి సినిమా పరిశ్రమకే అంటిపెట్టుకొని ఉన్నాడు.

ఒక్క తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాకుండా తమిళ, కన్నడ భాషల్లో కూడా నటిస్తూ అక్కడి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ నటుడికి చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. చిరుకి కూడా ఈ యాక్టర్ పై అమితమైన అభిమానం ఉంది. మెగాస్టార్ ని ఈ నటుడు అన్నయ్య అని చాలా ప్రేమగా పిలుస్తాడు. ఈ నటుడి కుమారుడు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోగా అరంగేట్రం చేశాడు.

ఇంతకీ ఆ నటుడు ఎవరో గెస్ చేశారా.. అదేనండీ, మీరు ఊహించినట్లే ఆ నటుడు మరెవరో కాదు బ్రహ్మాజీ. బ్రహ్మాజీ గులాబీ, సింధూరం, నిన్నే పెళ్లాడుతా, సీతారామరాజు, ఢీ, అత్తారింటికి దారేది వంటి ఎన్నో హిట్ సినిమాలలో తన టెరిఫిక్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. అయితే ఫస్ట్ నుంచి చిరంజీవి కుటుంబంతో బ్రహ్మాజీకి మంచి అనుబంధంగా ఉండేది.

బ్రాహ్మజీ లవ్ స్టొరీ తెలిసి ఫిదా అవుతున్న కుర్రాళ్ళు... | Actor Brahmaji  Interesting Love Story With Wife Saswaty Details, Actor Brahmaji , Brahmaji  Love Story , Brahmaji Wife Saswaty , Saswathy, Sanjay Rao ...

భార్య కూడా మెగాస్టార్ కుటుంబానికి దగ్గర అయింది. ఆమె పేరు శశ్వతి. చాలా ఏళ్ల క్రితం సతీ సమేతంగా బ్రహ్మాజీ చిరంజీవిని కలిశాడు. ఆ సందర్భంగా శశ్వతి మెగాస్టార్ తో ఫోటో దిగింది. అదే ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా నెటిజన్లు చిరుతో ఉన్న ఈ మహిళ ఎవరా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆమె బ్రహ్మాజీ భార్య అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.