టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అన్నాదమ్ముల సినిమాలు రిలీజ్ అయితే చాలు థియేటర్స్ వద్ద రచ్చ మాములుగా ఉండదు. మొదటి రోజు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవ్వాల్సిందే. ఇక వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటించారంటే ఆ సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఓ సినిమాలో పవన్ కళ్యాణ్ కేవలం 10 సెకన్లు మాత్రమే ఒక గెస్ట్ రోల్లో కనిపించి మాయమవుతాడు. అప్పటికి పవన్ కళ్యాణ్ కు అంతగా క్రేజ్ కూడా రాలేదు. ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అది ఇప్పటివరకు జరగలేదు. ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి నటించిన డాడీ సినిమాకి పవన్ కళ్యాణ్‌కి ఒక లింక్ ఉండట.. అదేంటో ? ఒకసారి చూద్దాం.
చిరంజీవి సరసన సిమ్రాన్ హీరోయిన్గా నటించిన సినిమా డాడీ. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిన్న రోల్ ప్లే చేసిన సంగతి అందరికీ తెలిసింది. కాని ఈ సినిమాకి పవన్‌కి కూడా సంబంధం ఉందట. ఈ సినిమాలో చిరంజీవి కూతురు ఫండ్ కోసం వెళ్ళగా అక్కడ వాళ్ళు చీట్ చేయడంతో చిరంజీవికి వారితో గొడవ జరిగి రౌడీలు ఫైట్ చేయడానికి వస్తారు. ఆ ఫైట్ సీన్ కొరియోగ్రాఫ్ చేసింది ఎవరో ? కాదు పవన్ అట. చాలామందికి పవన్ కొరియోగ్రాఫర్ గా కూడా చేశాడన్న విషయం తెలియదు.
పవన్ కళ్యాణ్ అప్పటికి అంతగా క్రేజ్ సంపాదించుకోలేదు. ప్రస్తుతం ఈ వార్త బయటకు వినిపించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో సహా చాలామంది సినీ అభిమానులు షాక్ అవుతున్నారు. చిరంజీవి బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ తర్వాత తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన పవన్ వరుసగా సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నాడు.