మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి జయ అపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. చిరు తన నటనతో టాలీవుడ్ లోనే తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకుని మెగాస్టార్ గా ఎదిగాడు. ఇదే సమయంలో చిరంజీవి తన కెరీర్ మొదట్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూసేవాడు.
అదే సమయంలో పున్నమినాగు సినిమాతో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తర్వాత అవకాశాలు రావడంతో స్టార్ హీరోగా మారాడు. చిరంజీవి ఇప్పటివరకు తన కెరీర్లో 150కు పైగా సినిమాల్లో నటించాడు. హీరోగా అందరికీ తెలిసిన చిరంజీవి గురించి ఒక విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో హిందీ సీరియల్ లో కూడా నటించారనే విషయం చాలా మందికి తెలియదు.
ఆ రోజుల్లో బాగా సూపర్ హిట్ అయిన రజిని అనే ఓ హిందీ సీరియల్ లో చిరు గెస్ట్ రోల్ లో నటించాడు. ఈ సీరియల్లో నటించిన సమయంలోనేే సినిమాల్లో అవకాశం రావడంతో ఆ సీరియల్ ను వదిలేసి సినిమాల వైపుకు వచ్చాడు చిరంజీవి. ఇక నిన్న మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు ఓ పన్నంటి ఆడబిడ్డ జన్మించడంతో మెగా కుటుంబమంతా సంబరాలు చేసుకుంటున్నాయి. మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా వారి కోరిక కూడా నెరవేరింది.