బేబీ మూవీ పై ప్రశంసలు వర్షం కురిపించిన రాఘవేంద్రరావు.. ఏమన్నాడంటే..?

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ” బేబీ “. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వీరాజ్ అశ్విన్ కీరోల్‌ ప్లే చేశాడు. ముక్కోణ‌పు ప్రేమ క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. బేబీ సినిమా రిలీజైన‌ మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

అందులో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా బేబీ మూవీ చూసిన వెంట‌నే టీంను పొగుడుతూ ప్రశంసించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ జగదేకవీరుడు అతిలోకసుందరి ‘, ‘ అన్నమయ్య ‘, ‘ శ్రీరామదాసు ‘ లాంటి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు తెర‌కెక్కించిన రాఘవేంద్ర‌ రావు ” బేబీ ” సినిమాను చూసి చిత్ర యూనిట్‌ను ఒక రేంజ్‌లో ఆకాశానికి ఎత్తేశారు.

తాను బేబీ సినిమాను చూసాను.. చాలా ఎంజాయ్ చేశాను.. సినిమా మొత్తం కథ చాలా బాగా తెర‌కెక్కించాడు సాయి రాజేష్. దర్శకత్వం కూడా చాలా బాగుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవ చైతన్య, వీరాజ అశ్విన్ పాత్రల్లో జీవించేశారు. మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటూ ట్విట్ చేశారు రాఘవేంద్రరావు. ఈ ట్వీట్‌కి బేబి దర్శకుడు సాయి రాజేష్ నాకు పెద్ద ఇన్స్పిరేషన్ మీరే.. మీ ‘ ఘరానా మొగుడు ‘ సినిమా చూసిన తర్వాత దర్శకత్వంపై ఇంట్రెస్ట్ వ‌చ్చింది. అలాంటి మీకు నా బేబీ సినిమా నచ్చడం నాకు చాలా హ్యాపిగా ఉంద‌ని రిప్లే ఇచ్చాడు.

బేబీ సినిమా విడుదలకు ముందే పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. విజయ బల్గాని ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇలా సినిమా విడుదలకు ముందే పాజిటివ్ క్రేజ్‌ని సంపాదించిన ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ వ‌ద్ద తుఫాన్ క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది.