రాజమండ్రి పార్లమెంట్ రాష్ట్రంలో ఏ పార్టీ గాలి ఉంటే…ఆ పార్టీ ఇక్కడ గెలుస్తూ ఉంటుంది. గత కొన్ని ఎన్నికల నుంచి అలాగే జరుగుతూ వస్తుంది. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి మార్గాని భరత్ దాదాపు లక్షా 20 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరి ఎంపీగా గెలిచాక భరత్ రాజమండ్రి సిటీ మీదే టార్గెట్ చేసినట్టుగా ఉంది. ఇటు సోషల్ మీడియాలోనూ నిత్యం హడావిడి చేస్తూ వస్తున్నారు.
నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తారా? లేక రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో క్లారిటీ లేదు. సరే ఎవరు పోటీ చేసిన రాజమండ్రి పార్లమెంట్ లో ప్రస్తుతం ఉన్న పరిస్తితులని బట్టి చూస్తే..ఇప్పటికీ వైసీపీకే ఆధిక్యం కనిపిస్తుంది. గతంతో పోలిస్తే కాస్త వ్యతిరేకత ఉన్నా సరే..వైసీపీకి ఓట్ల చీలిక కలిసొచ్చేలా ఉంది. అంటే ఇక్కడ టిడిపి-జనసేన వేరు వేరుగా పోటీ చేస్తే డౌట్ లేకుండా వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.
గత ఎన్నికల్లో వైసీపీకి లక్షా 20 వేల మెజారిటీ వస్తే..జనసేనకు లక్షా 50 వేల ఓట్లు పడ్డాయి. అంటే అప్పుడు టిడిపి-జనసేన కలిస్తే వైసీపీ గెలిచేది కాదు..ఇప్పుడు అంతే టిడిపి-జనసేన కలిస్తే వైసీపీ గెలవదు..అలా కాకుండా విడిగా పోటీ చేస్తే మళ్ళీ వైసీపీకే ఛాన్స్ ఉందట. ఇక రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, గోపాలాపురం, నిడదవోలు సీట్లు ఉన్నాయి.
వీటిల్లో సిటీ, నిడదవోలు సీట్లలో టిడిపికి ఎడ్జ్ ఉంది. అనపర్తి, రాజానగరం సీట్లలో వైసీపీకి ఎడ్జ్ ఉంది. గోపాలపురంలో టీడీపీకి ప్లస్ ఉంది. అయితే టిడిపి-జనసేన కలిస్తే రాజమండ్రి సిటీ, రూరల్, కొవ్వూరు, నిడదవోలు, రాజానగరం, గోపాలాపురం సీట్లలో వైసీపీకి చెక్ పడిపోతుంది. కాబట్టి పొత్తుతోనే రాజమండ్రిలో వైసీపీకి చెక్ పెట్టవచ్చు.