ఏసుప్రభు జీవిత చరిత్ర అయిన దయామయుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది గౌతమి. అప్పట్లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో గౌతమి ఒకటి. 1980 – 90లో ఆమెకు మంచి క్రేజ్ ఉండేది. ఆమె తెలుగు, తమిళ్ భాషల్లో చాలా సినిమాల్లో ఎంతమంది అగ్రతారలతో నటించింది. గౌతమి దయామయుడు సినిమా తర్వాత కూడా శ్రీనివాస కళ్యాణం, అగ్గి రాముడు, అన్న తమ్ముడు, జెంటిల్ మెన్, బొబ్బిలి రాయుడు, రత్నగిరి అమ్మోరు ఇలా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సాధించింది.
1998లో సందీప్ భాటియా అనే ఒక బిజినెస్ మాన్ వివాహం చేసుకుంది గౌతమి. తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైంది గౌతమి. వివాహమైన సంవత్సరానికి కొన్ని వ్యక్తిగత కారణాలతో భర్తకు డివోర్స్ ఇచ్చింది. గౌతమికి ఒక కుమార్తె కూడా ఉంది.. ఆమె పేరు సుబ్బలక్ష్మి. గౌతమి – సందీప్ కు విడాకులు ఇచ్చిన కొంత కాలం తర్వాత 2004 నుంచి 2016 వరకు ప్రముఖ నటుడైన కమలహాసన్ తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంది. తర్వాత ఆమె కమల్ హాసన్‌తో ఉన్న రిలేషన్ బ్రేకప్ చేసినట్టు స్వయంగా ప్రకటించింది.
ప్రస్తుతం గౌతమి తన కూతురితో కలిసి ఉంటుంది. గౌతమి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు గౌతమి తన కుటుంబ విషయాలను.. కూతురు సుబ్బలక్ష్మితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. గౌతమి తాజాగా తన కూతురు సుబ్బలక్ష్మితో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా గౌతమీ కంటే ఆమె కూతురు మరింత అందంగా కనిపిస్తుంది.
దాంతో పాటు సుబ్బలక్ష్మి అందులో చాలా ట్రెడిషనల్ గా ఉండడంతో.. ఆమెకు చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది సుబ్బలక్ష్మి చూడడానికి మహాలక్ష్మి లా ఉందంటూ.. మరి కొంతమంది అందంలో సుబ్బలక్ష్మి ఆమె తల్లిని మించిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు .ఇటీవల గౌతమి సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. స్టోరీ ఆఫ్ టక్స్ అనే తమిళ్ సీరియస్ లో గౌతమి నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం గౌతమి అన్ని మంచి శకునాలే సినిమా షూటింగ్లో బిజీగా ఉంది