బిజినెస్ మేన్ పట్టుకునేందుకే హీరోయిన్ అవుతున్నారా..? అంటే ఇండస్ట్రీ కంటే కూడా బయట జనాలలో ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఎవరు పాపులర్ అవ్వాలన్నా ఒకటి సినిమా ఇండస్ట్రీ ఇంకోటి రాజకీయాలు. అమ్మాయిలు గ్లామర్ ప్రపంచంలోనే ఊరేగాలనుకుంటారు. కాబట్టి, రాజకీయాలను కాకుండా సినిమా ఇండస్ట్రి ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇక్కడ కొందరు సినిమా అంటే పిచ్చితోనే వస్తున్నారు.
దానికోసం మోడలింగ్ రంగంలో ముందు అడుగుబెట్టి ఆ తర్వాత హీరోయిన్ అవకాశాలు అందుకుంటున్నారు. అయితే ఏళ్ళ తరబడి హీరోయిన్ గా సక్సెస్ సాధించిన వారు ఎక్కువగా బిజినెస్ మేన్ ని పెళ్ళి చేసుకొనిటిలవుతున్నారు. ఇండస్ట్రీలో చాలా తక్కువమంది హీరోలు హీరోయిన్ నే పెళ్ళి చేసుకుంటున్నారు. అలాగే హీరోయిన్స్ కూడా. ఎక్కువశాతం హీరోయిన్స్ విదేశాలలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వందల కోట్లు ఉన్న బిజినెస్ మేన్స్ ని పెళ్లి చేసుకుంటున్నారు.
ప్రియమణి, లయ, శ్రీయ శరణ్ లాంటి స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకుందీ బిజినెస్ మేన్ లనే. స్నేహ లాంటి వారు ఇండస్ట్రీలో ఉన్న సహ నటుణ్ణి, దర్శకుణ్ణి, నిర్మాతలను పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. సీనియర్ నటి రాశి సినిమా ఇండస్ట్రీలో అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకొని షాకిచ్చింది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి.
అయితే, ఇటీవల కాలంలో కొందరు యంగ్ బ్యూటీస్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేస్తే చాలు ఆ తర్వాత ఓ పెద్ద వ్యాపార వేత్తను ప్రేమించి పెళ్ళి చేసుకోవచ్చు..అనే ప్లాన్ తో ఇండస్ట్రీకి వస్తున్నారట. సోషల్ మీడియాలో మీడియా వర్గాలలో ఇదే ఎక్కువగా ఈ మధ్య వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్ ని క్రికెటర్స్ పెళ్ళి చేసుకుంటున్నదీ చూస్తున్నాము. అంటే కాస్త హీరోయిన్ గా క్రేజ్ వస్తే అమ్మాయిలకి ఎంతటి క్రేజ్ ఉంటుందో అర్థమవుతుంది.