ఆ స్టార్ హీరోయిన్ బట్టలు లేకుండా వచ్చిన పర్లేదు .. నాగేశ్వరరావు మంచి రసికుడే..!

మన తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు లాగా చెప్పుకునే వారిలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో అనుకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఏఎన్ఆర్ తన కెరీర్ లో ఎక్కువ శాతం హిట్ సినిమాల్లోనే నటించారు. ఈ క్రమంలోనే సీనియర్ దర్శకుడు రచయిత కనగాల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగేశ్వరరావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ ఇంటర్వ్యూలో కనగాల జయకుమార్ మాట్లాడుతూ.. దాసరి నారాయణరావు డైరెక్షన్లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక సినిమా షూటింగ్ జరుగుతుందని ఆ సినిమాలో నాగేశ్వరరావు హీరోగా అలాగే జయప్రద హీరోయిన్‌గా నటించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఓ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ ప్రారంభించగా హీరోయిన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని దాస‌రి గారు అసిస్టెంట్ డైరెక్టర్ ను పిలిచి జయప్రదను త్వరగా రావాలని చెప్పమని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక అసిస్టెంట్ డైరెక్టర్ జయప్రద మేకప్ రూమ్ దగ్గరికి వెళ్లి తిరిగి వచ్చి జయప్రద బట్టలు వేసుకుని వస్తానని చెప్పిందని దాసరికి చెప్పారు అసిస్టెంట్ డైరెక్టర్.. ఆ తర్వాత దాసరి నారాయణరావు పక్కనే కూర్చున్న అక్కినేని నాగేశ్వరరావు జయప్రద బట్టలు లేకుండా వచ్చిన మాకేం అభ్యంతరం లేదని చెప్పవయ్యా అని సరదాగా అన్నారని కనగాల ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నాగేశ్వరరావు గారి సెటైర్లో ఎంతో గమ్మత్తుగా ఉంటాయని అలాంటి చతురత ఏఎన్ఆర్ గారికే ఉందని ఆయన వెల్లడించారు.

నాగేశ్వరరావుగారు హీరోయిన్లతో సరదాగా ఉంటారని, ఎన్టీఆర్ ఎప్పుడూ సీరియస్ గా ఉంటారని.. అలాగే శోభన్ బాబు హీరోగా వచ్చిన సంపూర్ణ రామాయణం సినిమా షూటింగ్లో ఎస్పి రంగారావు రావణాసురుడి గెటప్ లో ఉండగా ఆయనకు ఆయనకు రావాల్సిన సిగరెట్లు రాకపోవడంతో బీడీ కాల్చాడని ఈ విషయం చూసి ఒక ముసలావిడ ఎస్పి రంగారావు పైన చాలా ఫైర్ అయ్యింది అని తెలిపాడు. కనగాల జయకుమార్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి