చిరు హాట్ హీరోయిన్ ‘ వాణీవిశ్వ‌నాథ్ ‘ భ‌ర్త కూడా ఓ స్టార్ హీరోనే.. ఎవ‌రో తెలుసా..!

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది వాణి విశ్వనాథ్‌. ‘ చిన్ని కృష్ణుడు ‘ సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చిన వాణి విశ్వనాథ్ 20కి పైగా తెలుగు సినిమాల్లో నటించింది. చిరంజీవి సరసన ‘ ఘరానా మొగుడు ‘ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో గ్లామర్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాణి తరువాత టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్గా నటించింది.

గ్లామర్ షోలో కూడా వెనకడుగు వేయకుండా.. అందం, అభినయంతో ప్రేక్షకులు నకట్టుకోవడం ఆమెకు మరింత ప్లస్ పాయింట్‌గా అయింది. ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు తెచ్చి పెట్టింది. ఇక తర్వాత బాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాణి కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న టైంలో మలయాళ హీరో బాబురాజ్‌ని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక పెళైన‌ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.

వాణి విశ్వనాథ్ చివరిగా ‘ ఒరేయ్ బుజ్జిగా ‘ అనే సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. 2002లో వివాహం చేసుకున్న వాణి విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో సభ్యురాలుగా పనిచేసింది. కానీ ఎలాంటి పదవులను ఆశించలేదు. ఇక ప్రస్తుతం వాణి విశ్వనాథ్ సినిమాలకు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతుంది.