చిత్ర పరిశ్రమ అంటేనే ఓ మాయా లోకం.. ఎప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. రాత్రికి రాత్రే జీవితాలు తలరాతలు మారిపోతూ ఉంటాయి. చిత్రపరిశ్రమలో ఉండే సెలబ్రిటీల జీవితంలో ఎన్నో వింతలు జరిగాయి.. అలా ఎంతోమంది స్టార్ల జీవితాలు రాత్రికి రాత్రే ఎవరు ఊహించిన విధంగా చిన్న భిన్నం అయిపోయాయి. ఇక ఇప్పుడు ఈ లిస్టులోకి క్రేజీ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వస్తుంది.
ఛలో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహేష్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలతో నటించింది. ఇక్కడ మరీ ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమాతో ఇండస్ట్రీ హిట్ తెచ్చుకుని ఒక్కసారిగా తన కెరీర్ ను మార్చేసుకుంది. ఆ తర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయ అందుకుని నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది రష్మిక. ఒక ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా వరుస సినిమాతో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాణిస్తుంది.
ఇక ఎప్పటినుంచో బాలీవుడ్లో సినిమాలు చేయాలని చూస్తున్న చాలామంది హీరోయిన్లకు ఒక్క అవకాశం కూడా రాకపోయినా.. నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మిక మందన్నా మాత్రం ఇంతటి క్రేజీ ఆఫర్లు పట్టేయడానికి కారణం ఏంటి..? అంటూ బాలీవుడ్ లో సరికొత్త చర్చ మొదలైంది. అయితే ఇక్కడ మిగిలిన హీరోయిన్లు తమ రెమ్యూనరేషన్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వరని.
ఇక వారు చేసే సినిమాలకు క్రేజీ కండిషన్స్ పెడతారని.. కానీ ఇక్కడ రష్మిక మాత్రం ఎలాంటి కండిషన్లు పెట్టకుండా తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా చిత్ర యూనిట్ ఎంత అడిగితే అంత తగ్గించుకుంటుందని ఆ ఒక్క కారణంగానే బాలీవుడ్ లో ఈమెతో సినిమాలు చేయడానికి మేకర్స్ ఇష్టపడుతున్నారని తెలుస్తుంది. దీంతో బాలీవుడ్ మీడియాలో రష్మిక పేరు మరోసారి వైరల్ గా మారింది.