టాలీవుడ్‌కు రెడ్డి సామాజిక వర్గానికి ఎంతో విడదీయరాని సంబంధం ఉంది. ఇక తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్న దాదాపు అందరూ హీరోలు గత కొన్ని సంవత్సరాలుగా పన్ని కట్టుకుని మరీ రెడ్డి కులానికి చెందిన అమ్మాయిలని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఇదేమి ఈ కాలంలో కొత్తగా జరగటం లేదు. ఒక దశాబ్ద కాలంగా ఇదే తంతు జరుగుతూ వస్తుంది. ఇక రీసెంట్గా శర్వానంద్ కూడా రక్షిత రెడ్డి అనే అమ్మాయితో తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. శర్వానంద్ పెళ్లి తర్వాత టాలీవుడ్ లో ఉన్న చాలా మంది యంగ్ హీరోలు అందరూ కూడా పని గా మరి రెడ్డి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారని చర్చ ఎప్పుడు మొదలైంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దుమారం కూడా మొదలైంది.
ఆర్ఎక్స్ 100సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ కూడా లోహిత రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగా, మంచు మనోజ్ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమ నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నాడు. మనోజ్ సోదరుడు మంచు విష్ణు సైతం వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి విరోనికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఇక మరో అక్కినేని హీరో సుమంత్ సైతం కీర్తి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లకే విడిపోయారు. మరో యంగ్ హీరో నితిన్ కూడా షాలిని రెడ్డి అనే అమ్మాయిని గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు. చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం అపోలో సంస్థల చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది. ఇక టాలీవుడ్ అగ్ర కామెడియన్ బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజు గౌతమ్ సైతం రెడ్డి కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
మరో అక్కినేని మేనకోడలు యార్లగడ్డ సుప్రియ సైతం చరణ్ రెడ్డి అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇతడు పెళ్లయిన కొన్ని రోజులకే విడిపోవుతుందో ఆయన చనిపోయాడు. ఇలా చాలామంది టాలీవుడ్ లో ఉన్న హీరోలు హీరోయిన్లు రెడ్డి సామాజిక వర్గంపై మనసు పారేసుకున్నారు.