క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా ఉన్న చర్చ అందరికీ తెలిసిందే. ఇది బాలీవుడ్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి పాకిందని అంటారు. కానీ, వాస్తవానికి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందని చాలా మందికి తెలియదు.. అప్పట్లోనే హీరోయిన్లను అన్ని కోణాల్లోనూ దర్శకులు, నిర్మాతలు పరిశీలించేవారట. ముందు తమకు కను విందు చేయాలని ఎస్. డీ. లాల్ వంటి దర్శకులు చెప్పేవారట.
ఆయన గొప్పద ర్శకుడే అయినా.. ఆయనపై బాలీవుడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో లాల్ దగ్గర పనిచేసేందుకు హీరోయిన్లు జంకేవారు. అంతేకాదు.. వారు అనేక సందర్భాల్లో ఇబ్బందులు కూడా పడ్డా మని.. అప్పట్లోనే ఫిర్యాదులు చేసేవారు. అయినా.. లాల్ మాత్రం తన పద్ధతిని మార్చుకోలేక పోయారు. లాల్ దర్శకత్వం వహించిన అనేక సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి.
కానీ, ఆయన మాత్రం హీరోయిన్‌ను సమగ్రంగా అనుమతించాకే తీసుకునేవారు. ఓ సందర్భంలో హీరోయిన్ విజయనిర్మలను (అప్పటికి ఇంకా వివాహం కాలేదు) లాల్.. ఒకసారి నా రూంకు వచ్చిపో అంటూ.. పిలిచారు. ఈ విషయాన్ని ఆమె సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై పెద్ద రచ్చే చేశారు. దీంతో లాల్ తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయి.. బాలీవుడ్‌లో సినిమాలు చేయడం ప్రారంభించారు.
అయితే.. లాల్ అంటే.. సాహసోపేతమైన సినిమాలకు కేరాఫ్ కావడంతో ఆయనను తిరిగి కృష్ణ ఇండస్ట్రీకి తీసుకువచ్చారు. మొత్తానికి లాల్ వ్యవహారం అంటే.. అప్పట్లో హాట్ టాపిక్ కావడం గమనార్హం.