నటసింహం నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.. ఇక ఈమె ఇటు నందమూరి కుటుంబం మరోవైపు నారావారి కుటుంబానికి ఓ ఆశాజ్యోతి గా కనబడుతుంది.. ఇప్పటికే నారా బ్రాహ్మణి హెరిటేజ్ గ్రూపులో కీలకపాత్ర పోషిస్తుంది.. అంతేకాకుండా తన తండ్రి చైర్మన్గా ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ మరియు ట్రస్ట్ కి బోర్డు మెంబర్ గా కొనసాగుతుంది.
ఇక నందమూరి తారకరామారావు తర్వాత వారి కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది రాజకీయాలలోకి చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. నటరత్న ఎన్టీఆర్ మాత్రం ఈ రెండిటిలో తిరుగులేని తన ముద్ర వేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన తర్వాత అంతగా ఆయన వారసులు ఎవరు అంత పేరు తెచ్చుకోలేకపోయారు.. బాలకృష్ణ సినిమాలలో తన తండ్రికి తగ్గ నటుడుగా అనిపించుకున్న రాజకీయాల్ని అంత పెద్దగా పట్టించుకోలేదు.
ఇక తర్వాత హరికృష్ణ, పురందేశ్వరి కూడా వారికి తగినట్టుగా రాజకీయాల్లో ముందుకు వెళ్లారు. అయితే వీరిద్దరూ రాజకీయాల్లోకి వచ్చినా కూడా పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయారు.. ఇక ఇప్పుడు నారా బ్రాహ్మణికి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. హెరిటేజ్ గ్రూప్ చైర్మన్గా ముఖ్యపాత్ర పోషిస్తూ.. బసవతారకం క్యాన్సర్ ట్రస్ట్ మెంబర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది.
నారా బ్రాహ్మణి స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి.. అమెరికాలో జాబ్ చేయకుండా మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చి తన తండ్రి చెప్పినట్లుగా చంద్రబాబు కొడుకు లోకేష్ ని పెళ్లి చేసుకుని.. తన మామగారు చంద్రబాబు వ్యాపారాలని ముందుకు తీసుకు వెళ్తూ ఒక వ్యాపారవేత్తగా దేశమంతా తిరుగుతూ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది.