మన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తొలిసారిగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న హీరో ఎవరంటే అది మెగాస్టార్ చిరంజీవి. మన ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోలను అది ఏ హీరోకి సాధ్యం కాలేదు. కేవలం ఒక్క మెగాస్టార్ చిరంజీవికేే సాధ్యమైంది. అదేవిధంగా మన ఇండియన్ హీరోయిన్లలోతోలిసారిగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరు అనే ఆసక్తికరమైన చర్చ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మన భారతీయ చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ టు మాలీవుడ్ వరకు అత్యంత ప్రేక్షక దరణ పొందిన హీరోయిన్ల జాబితాలో రేఖ, మాధురి దీక్షిత్, కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, ఆలియా భట్.. ఎందరో హీరోయిన్లు ఈ జాబితాలో ఉన్నారు. కానీ మన భారతీయ చిత్ర పరిశ్రమలో మొదటిసారిగా కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరోయిన్ మాత్రం పై పేరులో ఉన్న హీరోయిన్ ఎవరూ కాదు. అవును మనం ముందు చెప్పుకున్న హీరోయిన్లలో ఒకానొక సమయంలో అత్యధిక పారితోషకం అందుకున్న వాళ్లే కానీ..తోలిసారిగా కోటి రూపాయలు డిమాండ్ చేసిన హీరోయిన్ మాత్రం అతిలోక సుందరి శ్రీదేవినే.
బాలీవుడ్‌తో పాటు అన్నీ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా ఉన్నా శ్రీదేవి తొలిసారిగా కోటి రూపాయలు డిమాండ్ చేసిన హీరోయిన్ గా చర్రితలో నిలిచిపోయింది. ఆమె అప్పటి హీరోలకు సమానంగా పారితోషికం డిమాండ్ చేసినప్పటికీ.. నిర్మాతలు మాత్రం ఆమెకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని శ్రీదేవి అడిగానంత ఇచ్చేసేవారు. ఆమెతో నటించాలని స్టార్ హీరోలు సైతం ఎంతో ఆశపడేవారు.
ఒకానొక సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. ఆమెతో కలిసి నటిస్తే తమని ఎవ్వరూ గుర్తించడం లేదని.. అభిమానులు, ఆడియెన్స్ ఫోకస్ అంతా శ్రీదేవిపైనే ఉంటోంది అని చెప్పుకొచ్చాడు. అందుకే ఆమెతో సినిమాలు చేయాలంటే భయం వేస్తోంది అని సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. హీరోలను సైతం అభద్రతా భావానికి గురిచేసేంత గొప్ప ఇమేజ్ శ్రీదేవి సొంతం. దటీజ్ శ్రీదేవి స్టామినా.