ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్ గా ఒక వెలుగు వెలిగిన సిద్ధార్థ్ “బాయ్స్” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమానే మంచి హిట్ కొట్టడంతో ఆ తర్వాత వరుస హిట్ సినిమాలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఓయ్, చుక్కల్లో చంద్రుడు, ఓ మై ఫ్రెండ్ వంటి సినిమాలు సిద్ధార్థ్ కు ఎంతో క్రేజ్ తెచ్చి పెట్టాయి. అలాంటి సిద్ధార్ధ్ తర్వాత సినిమా చాన్సులు తగ్గడంతో ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉన్నాడు.
అయితే సిద్ధార్ధ్ స్టార్ డం సంపాదించిన తరువాత టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అతనికి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తరువాత మహా సముద్రం అనే సినిమాతో రీ ఏంట్రి ఇచ్చాడు సిద్ధార్ద్. ఈ సినిమాలో శర్వానంద్ , సిద్ధార్థ్ నటించారు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో తర్వాత సిద్ధార్థ్ కు కొంతకాలం బ్రేక్ పడింది. తాజాగా సిద్ధార్థ్ టక్కర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు సిద్ధార్థ్. ఈ సినిమా జూన్ 9న విడుదల కాబోతున్న క్రమంలో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.
ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న సిద్ధార్థ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. సిద్ధార్థ్ మాట్లాడుతూ..” నేను గతంలో ఎన్నో సినిమాల్లో నటించా.. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేను వద్దంటానా అలాంటి సినిమాలకు పదుల సంఖ్యలో నంది అవార్డ్స్ వచ్చాయి.. అయితే సినిమాలో అన్ని కేటగిరీలకు నంది అవార్డ్స్ వచ్చాయి కానీ హీరోగా నటించిన నాకు ఎటువంటి అవార్డు రాలేదు… అయితే నా యాక్టింగ్ బాగుంది కానీ కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కావాలని నాకు అవార్డులు రాకుండా నన్ను తొక్కేస్తున్నారు .. ఆ విషయంలో నాకు చాలా బాధేసింది ” అంటూ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు..” సినిమాలో నటించిన దాదాపు అందరికీ అవార్డ్స్ వచ్చాయి. కానీ నాకు మాత్రం ఎటువంటి అవార్డు రాలేదని నేను అప్పట్లో అనుకునేవాడిని… కానీ అవన్నీ నేను తర్వాత వదిలేసానని ..దానికి మెయిన్ రీజన్ చాలామంది జనం ఇప్పుడు నన్ను గుర్తుపట్టి ..మీరు ఆ సినిమా బాగా చేశారు సార్ అని పొగడడం నాకు చాలా ఆనందంగా ఉందని.. అవార్డు వచ్చిన దానికంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చాడు. అంతకంటే మంచి అవార్డు నా దృష్టిలో ఉండదు ” అంటూ సిద్దార్ద్ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సిద్దార్ధ్ మాట్లాడిన మాటలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి..!!