తాజాగా విజయవాడకు వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంస లు గుప్పించారు. తనకు-ఎన్టీఆర్‌కు ఉన్నఅనుబంధం గురించి చెప్పారు. బహుశ ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమానికి ఆయన హాజరు కావడం ఇదే తొలి సారి కావడం.. పార్టీలో కొత్త ఊపు తీసుకువచ్చింది. అయితే.. రజనీ.. రాజకీయంగా తాను మాట్లాడాలని అనుకున్నానని చెబుతూనే, మాట్లాడలేకపోవడం ఒక్కటే మైనస్ అయింది.
అంత పెద్ద కార్యక్రమంలో రజనీ చేసిన ప్రసంగం.. అందరినీ మంత్రముగ్ధులను చేసిందనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా రజనీకి జేజేలు పలికారు వ్యక్తిగతంగా రజనీకి ఉన్న ఇమేజ్.. టీడీపీకి బాగానే ప్రయోజనం చేకూర్చింది. రజనీరాక.. ఆయన ప్రసంగం రెండు కూడా.. పార్టీకి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయనే అంచనాలు ఇప్పుడు నిజం అవుతున్నాయని అంటున్నారు.
అయితే.. రాజకీయాలను ఉద్దేశించి రజనీ మాట్లాడి ఉంటే బాగుండేదని.. ఎక్కువ మంది అభిప్రాయపడి నా.. ఆయన మాత్రం కేవలం ఎన్టీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యానికి మాత్రమే పరిమితం అయ్యారు. ఎన్టీఆర్ గురించే ఎక్కువగా చెప్పుకొచ్చారు. అదే సమయంలో చంద్రబాబు గురించి.. పార్టీ గురించి.. రజనీ మరింత ఎక్కువగా స్పందించి ఉంటే.. ఆ రేంజ్ వేరేగా ఉండేదనే అభిప్రాయం ఎక్కువగా వినిపించింది.
సాధారణంగా రజనీ రాజకీయ సభలకు వచ్చిన , వస్తున్న సందర్భాలు పెద్దగా కనిపించడం లేదు. అలాంటిది టీడీపీ పెట్టిన సభకు రావడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక, రాజకీయంగా మాట్టాడి ఉంటే.. ఆయన ఏం చెప్పి ఉండేవారు? అనేది కూడా చర్చకు దారితీసింది. చంద్రబాబు హయంలో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది.
ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ అబివృద్ధికి ఆనాడు అన్నగారు.. తర్వాత.. చంద్రబాబు చేసిన కృషి, నభూతో అన్నట్టుగానే సాగింది. అదేవిధంగా ఐటీకి చంద్రబాబు పెద్దపీట వేశారు. ఆయా విషయాలను రజనీ కొంత మేరకు ప్రస్తావించినా.. మరింతగా చెప్పి ఉంటే.. బాగుండేదని ఎక్కువ మంది ఆశించారు. ఏదేమైనా..రజనీ రాక. టీడీపీలో జోష్ పెంచిందనే చెప్పాలి.