టాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్ హిట్లతో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న భగవంత్ కేసరి సినిమా టీజర్ కూడా అదిరిపోయింది. భగవంత్ కేసరి బాలయ్యకువరుసగా మూడో బ్లాక్ బస్టర్ అవుతుందన్న అంచనాలు అయితే ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో చేసిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ బ్లాక్బస్టర్ అయ్యింది. ఈ సినిమా నాలుగు కేంద్రాల్లో 100రోజులు ఆడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ సినిమా 50 రోజులు ఆడడమే గగనం. అలాంటిది వీరసింహారెడ్డి 100 రోజులు దాటేసి ఇప్పుడు ఏకంగా 175 రోజులు ఆడుతోంది.
కర్నూలు జిల్లాలోని ఆలూరు పట్టణంలోని శ్రీ లక్ష్మినరసింహా థియేటర్లో డైరెక్టుగా 4 ఆటలతో వీరసింహారెడ్డి ఏకంగా 175 రోజులు ఆడింది. అఖండ గుంటూరు జిల్లా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 175 రోజులు ఆడింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 175 రోజుల సినిమాలతో బాలయ్య సెన్షేషనల్ క్రియేట్ చేశారు. ఈ తరం జనరేషన్ హీరోలలో ఇలాంటి అరుదైన రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరోగా బాలయ్య అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఆలూరు లాంటి సీ సెంటర్లో బాలయ్య సినిమా 175 రోజులు ఆడడం అంటే మామూలు విషయం కాదు. ఇక భగవంత్ కేసరి దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వెంటనే బాలయ్య – బాబి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.