ఒక ప్రక్క అనారోగ్యం… అయినా పాపం స‌మంత క‌ష్టాలు చూశారా…!

సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం అయినా ఇంకా స్టార్ హీరోయిన్‌గా అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. వరుస సినిమాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల‌తో నటిస్తూ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. తన పర్సనల్ లైఫ్ లో అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సమంత… నాలుగేళ్లు కూడా కాపురం చేయ‌కుండానే విడాకులు తీసుకుంది. ఆ త‌ర్వాత సినిమాలు చేస్తున్నా మయోసైటిస్ వ్యాధి కారణంగా ఎన్నో ఇబందులను ఫేస్ చేసింది.

ఆమె డేట్స్ ఇచ్చినా ప్రాజెక్ట్స్ పూర్తి చేసి అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకుందట‌. ఇక తాజాగా ఈమె డేట్లు ఇచ్చిన ప్రాజెక్టుల‌లో ఖుషి క్లైమాక్స్ కూడా పూర్తి చేసుకుంది సమంత. అలాగే బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ జూలై 13న పూర్తి అయింది. ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో తన అనారోగ్యానికి చికిత్స చేయించుకునే ప్లాన్‌లో ఉంది. ఈ క్ర‌మంలోనే యేడాదికి పైగా సినిమాల‌కు గ్యాప్ తీసుకోనుందంటున్నారు.

ఈ వార్తలో నిజమో కాదు అని సందేహం ఉన్న టైంలో సమంత హెయిర్ స్టైలిస్ట్‌ రోహిత్ బ‌త్క‌ర్ చికిత్స సమయంలో ఆమెకు శక్తి మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలి… సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. దీంతో ఆమె చికిత్స కోసం అమెరికా వెళుతుంద‌న్న విష‌యం క్లారిటీ వచ్చేసింది. మయోసైటిస్ చికిత్స కోసం సినిమాల‌కు యేడాది గ్యాప్ తీసుకున్నా కూడా స‌మంత తన బిజినెస్ ప్రమోషన్లు ఆపలేదు.

సమంతకు సాకి పేరుతో బ‌ట్ట‌ల‌ బ్రాండ్ ఉంది. ఇందులో స్పెషల్ గా ఉమెన్స్ వేర్ ఎక్కువగా లభిస్తాయి. ఈ బ్రాండ్ చాలా కాలంగా సమంత ర‌న్ చేస్తుంది. ఈ సంస్థ ద్వారా వచ్చే ప్రాఫిట్ చారిటీ, సోషల్ వర్క్స్ కోసం సమంత యూస్ చేస్తుందట. తాజాగా సాకీ బ్రాండ్ న్యూ కలెక్షన్ ప్రమోట్ చేయడానికి సమంత ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. చికిత్స తీసుకోవడానికి లాంగ్ లీవ్ పెట్టినా సమంత తన వ్యాపారాల కోసం ఎంత కష్టపడుతుందో అంటూ సోషల్ మీడియాలో ఆమెపై సానుభూతి కామెంట్స్ పెడుతున్నారు నేటిజన్స్.