గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్‌లో ఓ సంచలనం. ఆమె వైవీఎస్ చౌదరి హీరోగా వచ్చిన దేవదాసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌కు ఇదే తొలి సినిమా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత ఇలియానా వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఆరేడు సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలేసింది. ఆమె సన్నని నడుము ఒంపులకు తెలుగు జనాలు ఫిదా అయిపోయారు.
ఇక మహేష్‌బాబుకు జోడీగా ఆమె చేసిన పోకిరి, పవన్ పక్కన చేసిన జల్సా, ఎన్టీఆర్ పక్కన రాఖీ, బన్నీ పక్కన జులాయి సినిమాలు ఆమె రేంజ్‌ను ఎక్కడికో తీసుకు వెళ్లాయి. వరుసగా క్రేజీ హీరోలతో క్రేజీ ప్రాజెక్టులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌లో వెలిగిపోవాలన్న ఆలోచనతో తెలుగు ప్రాజెక్టులు వదులుకుని అక్కడకు వెళ్లి పెద్ద రాంగ్ స్టెప్ వేసింది.
బాలీవుడ్ జనాలు ఆమెను పట్టించుకోలేదు. ఆ తర్వాత మరీ బోల్డ్‌గా మారిన ఇలియానా బోల్డ్ ఫొటోలు, బోల్డ్ కామెంట్లతో సోషల్ మీడియాలో రెచ్చిపోతూ వస్తోంది. కొద్ది రోజుల క్రితమే తాను ప్రెగ్నెంట్ అని చెప్పిన ఇల్లూ బేబీ ప్రెగ్నెన్సీని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఫొటోలు పోస్ట్ చేస్తోంది. అయితే ఈ ప్రెగ్నెన్నీకి కారణం ఎవరు ? అన్న దానిపై నెటిన్లు కూడా రకరకాల ప్రశ్నలతో ఇలియానాను విసుగెత్తిస్తున్నారు.
ఎట్టకేలకు ఇలియానా తన ప్రియుడి ఫొటో షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఇద్దరు ముద్దు పెట్టుకుంటోన్న ఫొటో షేర్ చేసింది. అలాగే ప్రెగ్నెన్నీ అనేది ఓ అందమైన వరం.. ఈ క్షణాన్ని అనుభవించడం నా అదృష్టం. ఒక ప్రాణానికి జన్మనిచ్చిన అనుభవం ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో నేను మాటల్లో చెప్పలేను.. చివరగా నేను అంతా కోల్పోయాను అనుకుంటోన్న టైంలో నా చేయి పట్టుకున్నావు… నా కన్నీళ్లు తుడిచి.. నన్ను నవ్వించే ప్రయత్నం చేశావు.. నాకు కావాల్సింది కూడా నీ నుంచి ఓ కౌగిలింత మాత్రమే అంటూ తన ప్రియుడి గురించి కామెంట్ చేసింది.
ఇప్పుడు ఈ ఫొటోతో పాటు ఈ కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ ఫొటో ఆమె రివీల్ చేసినా కూడా ప్రియుడి ఫేస్ సరిగా కనపడడం లేదు. కలర్లో ఫ్రంట్ ఎండ్‌లో పూర్తిగా కనిపించేలా నీ ప్రియుడి ఫొటో షేర్ చేయాలని ఇలియానాకు నెటిజన్లు రిక్వెస్టులు పంపుతున్నారు.