ఇటీవల కాలంలో కుర్ర కారు ఎంత తొందరగా ప్రేమలో పడుతున్నారో అంతే తొందరగా బ్రేకప్ చెప్పుకుంటున్నారు. దానికి తోడు ఫ్యామిలీ టెన్షన్స్, వర్క్ ప్రెషర్, ఒంటరితనంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఒంటరితనం వల్ల లేనిపోని రోగాల భారిన పడుతున్నారు. అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.
మరి కొంతమంది బ్రేకప్ బాధలో అనాలోచిత నిర్ణయాలు తీసుకొంటు వారి కుటుంబాలకి భాధ కలిగిస్తున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి జపాన్ దేశం వాళ్లు సొల్యూషన్ కనిపెట్టారు. ఇప్పటివరకు మనం ఇల్లు, వాహనాలను అద్దెకు ఇవ్వడం చూసాం కానీ.. భాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా అద్దెకు ఇస్తున్నారు. ఇలా చేస్తే యువతను కాపాడవచ్చు అని భావిస్తుంది జపాన్ గవర్నమెంట్. ఈ రూల్ కొత్తగా తీసుకువచ్చింది.
దీని ద్వారా దేశంలో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళు ఒంటరితనాన్ని ఫీలయేవారెవరైనా అమ్మాయి లేదా అబ్బాయిని గంటల పాటు అద్దెకి తీసుకోవచ్చట. ఇందుకు గంటకు రూ.3000 ( ఇండియన్ కరెన్సీలో) చొప్పున డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా అమ్మాయిలో ఏమైనా ఎక్స్‌ట్రా క్వాలిటీస్ ఉండాలి అంటే దానికి అధికంగా మరో రూ.1200 చెల్లించాల్సి ఉంటుందట.