తెలుగులో ప్రముఖ యాంకర్ల పేర్లు చెప్పాలి అంటే వెంటనే రష్మి గుర్తొస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలలో యాంకర్‌గా ఆమె ఎందరో ప్రేక్షకులను సంపాదించుకుంది. ముఖ్యంగా జబర్దస్త్‌లో ఆమె యాంకరింగ్, స్కిట్లకు స్పందించే తీరు, సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ ఇలా ఎన్నో అంశాలు ఆమెను ప్రేక్షకుల మదిలో నిలిపాయి. వచ్చీ రాని తెలుగులో ఆమె పలికే డైలాగులు భారీగా హాస్యాన్ని పంచుతాయి.
వాటికి ఇతరులు వేసే పంచులు మరింత నవ్వు రప్పిస్తాయి. ఇలా కొంచెం అమాయకత్వం, కొంచెం తెలివి, సమయస్పూర్తి, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఆకట్టుకునేలా ఉంటాయి. యాంకర్ గానే కాకుండా హీరోయిన్ గానూ ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇటీవల ఆమె రెమ్యూనరేషన్‌కు సంబంధించిన ఓ వార్త సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఆమె డిమాండ్ విని అంతా నోరెళ్లబెడుతున్నారు.
బిగ్ బాస్ షోకు తెలుగులో ఉండే ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ షో ప్రసారమయ్యే సమయంలో అంతా టీవీలకు అతుక్కుపోతుంటారు. కంటెస్టెంట్లు చేసే హడావుడి, వారి మధ్య లవ్ ట్రాక్, గొడవలు, టాస్కులు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. తరువాత బిగ్ బాస్ షోలో పాల్గొనాలని నిర్వాహకులు ఇటీవల రష్మిని సంప్రదించినట్లు సమాచారం. దీనికి ఆమె కూడా అంగీకరించిందని, అయితే ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.
ఈటీవీలో ఆమె కనిపించే ఒక్కో షోకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లభిస్తుందని టాక్. అయితే బిగ్ బాస్ లో అంతకు మించి ఆమె అడిగినట్లు తెలుస్తోంది. అయితే నిర్వాహకుల స్పందన ఇంకా తెలియలేదని సమాచారం. ఇక రానున్న బిగ్ బాస్ షోలో హోస్ట్ మారనున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు అలరించిన నాగార్జున స్థానంలో రానా రానున్నట్లు అంతా చర్చించుకుంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఏదేమైనా ఈ సీజన్లో రష్మి పాల్గొంటే ఖచ్చితంగా ఆ షోకు ప్లస్ అవుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.