చాలామంది సాధారణంగా అనేక రకాల దంత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం దంతాల ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడమే. మెరిసే దంతాలు, తాజా శ్వాస మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. దంతాల సంరక్షణ మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచడానికి ఎంతగానో అవసరం. డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎక్కువగా నోటి ఆనారోగ్యానికి గురవుతారు. చాలామంది గర్భిణీ స్త్రీలు కూడా నోటి ఆరోగ్య సంరక్షణ గురించి పట్టించుకోరు. నోరు పరిశుభ్రంగా లేకపోవడం నోటి కోహరంలోని బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతుంది.
బ్రష్ సరిగ్గా చేయకపోతే ఈ బ్యాక్టీరియా వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అలాగే కొన్ని సార్లు రక్త ప్రవాహంలోకి బ్యాక్టీరియా చేరుకుని అనేక అనారోగ్యాలకు దారితీస్తుందని దంత నిపుణులు చెప్తున్నారు. ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఎక్కువగా డయాబెటిస్, హార్ట్ పేషెంట్స్ పై ప్రభావం చూపుతోందట. ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు చేరే అవకాశం కూడా ఉంది. ఇటీవల ఓ అధ్యయనం ద్వారా ప్రీ మెచ్యూర్డ్ డెలివరీ జరగడానికి స్వల్పమైన నోటి అనారోగ్యం కూడా కారణమని తెలిసింది.
రాత్రిపూట ఆహారం తీసుకున్న తర్వాత బ్రష్ చేయకపోతే ఇది కిణ్వ ప్రక్రియకు దారి తీస్తుంది. ఈ ప్రక్రియ వల్ల నోటిలో బ్యాక్టీరియా పెరిగి అనేక రకాల అనారోగ్యాలకు కారణమౌతుంది. ఇటువంటి అనారోగ్యాల భారిన పడకుండా నోటి పరిశుభ్రత కోసం ఏం చేయాలి ? చూద్దాం. సాధారణంగా అందరూ నిద్రలేచిన వెంటనే పళ్ళు తోముకుంటారు. కానీ బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత పళ్ళు తోముకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది లాలాజలం మొదట న్యూట్రలైజ్ యాసిడ్స్ తటస్థం చేస్తుంది.
నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. రోజుకు రెండుపూట్ల బ్రష్ చేయడం మంచిది. రాత్రిపూట కూడా బ్రష్ చేయడం వల్ల రోజంతా నోట్లో పేరుకుపోయిన సూక్ష్మక్రిములు పోతాయి. దీంతో మీ నోరు పరుశుభ్రంగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల సమాచారం ప్రకారం ప్రతి 7 నుంచి 8 నెలలకు ఒకసారి అయినా కచ్చితంగా దంత పరీక్షలు చేయించుకోవాలట. లేదంటే చిగుళ్ల సమస్యలు పెరిగిపోయి కొంతమందికి స్కేలింగ్ లేద నిర్వాహన చికిత్స అవసరం అవుతుంది.
చిగుళ్ల వ్యాధి లేదా దంతాల సమస్యల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాఫీ లేదా టీ తాగినప్పుడు లేదా భోజనం చేసిన తర్వాత కచ్చితంగా బ్రష్ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడైనా భోజనానికి 10 నిమిషాల తర్వాత బ్రష్ చేసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. రాత్రిపూట భోజనం తర్వాత నోటిని పుక్కిలించడం జాగ్రత్తగా నోటిని కడుక్కోవడం అవసరం.
కొంతమంది నోటి పరిశుభ్రత కోసం మౌత్‌వాష్‌లు వాడుతూ ఉంటారు. వీటివల్ల తాత్కాలికమైన శ్వాస అనుభూతి వస్తుందే తప్ప నోటి ఆరోగ్యాన్ని కాపాడలేవు. నోటి పరిశుద్ధ పాటించడానికి కొన్ని ఆరోగ్య అలవాట్లు.. చక్కెర, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ లాంటివి రోజు తీసుకునే అలవాటు ఉన్నవారు వీటిని తినడం తగ్గించాలి. పాలు తాగడం వల్ల దంతాలు తెల్లగా మారి బలపడతాయని కొంతమంది అపోహ పడుతుంటారు. కానీ ఇది కేవలం 5 సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రమే.