చాలామంది నాన్ – వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మారుతున్న జీవనం నేపథ్యంలో ప్రతి ఒక్కరు వీకెండ్‌లో చికెన్ ప్రియులు అయిపోతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు బయట రెస్టారెంట్లలో ఫ్యామిలీలతో సహా వాలిపోతున్నారు. చాలా మందికి అయితే వీక్ డేస్‌లో.. వారంలో నాలుగైదు రోజులు కూడా ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు.
ప్రతిరోజు చికెన్ రకరకాలుగా వండుకొని తినాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరు ప్రతిరోజు చికెన్ వండుకొని తింటున్నట్లయితే రోగాలను స్వయంగా ఆహ్వానిస్తున్నట్టే..! చికిన్ రోజు తినడం వల్ల అనేక రకాల భయంకరమైన వ్యాధుల భారీన పడి హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కోళ్ల ఫారం లో పెరిగే కోళ్లు అనేక రకాల కెమికల్స్ ని యూజ్ చేసి వాటిని పెంచడం వల్ల బరువు త్వరగా పెరుగుతాయి.
అసలు ఇప్పుడు పెరిగే కోళ్లు కేవలం 35 రోజుల్లో రెడీ అయిపోతున్నాయి. ఇందుకోసం రకరకాల మందులు వాడుతున్నారు. అలాంటి కోళ్లను మనం చికెన్ చేసుకొని తింటే ఎన్ని అనారోగ్యాలు వస్తాయో ఒకసారి తెలుసుకుందాం. కోళ్ల ఫారం లో పెరిగే కోళ్లు చికెన్‌ని ప్రతిరోజు తింటే భయంకరమైన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బాడీలో హీట్ పర్సంటేజ్ పెరిగి ముక్కులో నుంచి రక్తం కారడం, మొహం నిండా మొటిమలు రావడం లాంటి ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల ప్రతిరోజు చికెన్ తినేవారు ఆ అలవాటును మానుకోవడం మంచిది. వారానికి ఒకసారి చికిన్ తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.