దేవిక.. ఒకప్పటి అగ్రతార. చారిత్రక సినిమాల నుంచి జానపద సినిమాల వరకు దేవిక లేని సినిమాలేదం టే అతిశయోక్తి అనిపించినా.. నిజం. ఆమె సోల్ పాత్రల్లో నటించినసినిమాలు కూడా ఉన్నాయి. అంటే.. హీరో కన్నా ఎక్కువగానే ఆమెకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చాలా నటించారు. ఆమెకు కేవలం నటన మాత్రమే వచ్చు. కానీ, హీరోయిన్‌గా ఎక్కువ సినిమాల్లో పనిచేశారు. దీనికి కారణం.. ఆమె ముఖ వర్చస్సు.
దేవిక కనిపిస్తే.. చాలు అనే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అదేసమయంలో దేవికను ఒక్క సీన్‌లో అయినా.. నటింపచేయాలనే దర్శకులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే`అపూర్వ చింతా మణి` వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అనేకం వచ్చాయి. నిజానికి సావిత్రికన్నా.. అందంగా ఉంటుందనే పేరు తెచ్చుకున్నారు దేవిక.
అయితే.. ఆమె చేసిన ఒకే ఒక్క తప్పు కారణంగా.. ఇండస్ట్రీలో చాలా బ్యాడ్ అయ్యారు. అదే..సీనియర్లను లెక్కచేయకపోవడం. పోయిపోయి..నాగయ్య వంటివారితో ఆమె విభేదాలు తెచ్చుకున్నా రు. నాగయ్య తన దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆమె ప్రచారం చేశారు. వాస్తవానికి నాగయ్యకు డబ్బుతో పనిలేదు. ఎందుకంటే.. ఆయనే గొప్పగా డబ్బులు సంపాయించుకున్నారు.
అయితే.. ఎందుకు ఇలా ప్రచారం చేయాల్సి వచ్చిందో తెలియదు కానీ.. నాగయ్య తనకు డబ్బులు ఎగ్గొట్టారని చేసిన ప్రచారం దేవికను మైనస్ చేసింది. దీంతో దేవికను ఇండస్ట్రీ నుంచి అప్పట్లోనే మూడు సంవత్సరాలు దూరం పెట్టారు.