టాలీవుడ్ లో ఎలాంటి నేపథ్యం ఉన్న కథల్లో అయినా నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగలిగే సత్తా ఉన్న హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. టాలీవుడ్ దివంగత లెజెండ్రీ ప్రొడ్యూసర్ దగ్గుపాటి రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకటేష్.. కలియుగ పాండవులు అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. కె.రాఘవేంద్రరావు దర్శఖత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఖుష్బూ హీరోయిన్. తొలి సినిమా హిట్ అవడంతో మంచి అవకాశాలు కొట్టేశాడు వెంకీ.
ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకు పోయాడు. అన్ని జానర్లలోను నటించాడు. వెంకటేష్ నటించిన సినిమాల్లో మెజార్టీ హిట్స్ గా నిలిచాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిన వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎక్కువగా ఆకట్టుకున్నాడు. వెంకటేష్ పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువుగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు.
తాజాగా వెంకటేష్ గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా రాణించిన రామానాయుడుకు సినిమాలో హీరోయిన్లు ఎలా? ఉంటారు అనే అవగాహన ఉండడంతో వెంకటేష్ సినిమాల్లోకి వచ్చి హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదట. తన కొడుకు ఏ హీరోయిన్‌తో అయినా ఎక్కడ ప్రేమలో పడతాడో ? అన్న సందేహం ఆయనకు ఉండేదట.
వెంకటేష్ కి అలాంటి పరిస్థితి ఎన్నడు రాకూడదనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి రాకముందే నీరజ అనే అమ్మాయిని చూసి పెళ్లి చేశాడట. అలా సినిమాల్లోకి రాకముందే వెంకటేష్‌కి పెళ్లి అయ్యింది. కానీ వెంకటేష్ కు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదట. ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని ఒక మంచి స్థానంలో స్థిరపడిన తరువాత పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉండేవాడట.
రామానాయుడు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా వెంకటేష్ కి ఇష్టం లేకున్నా.. పెళ్లి జరిపించారని అంటారు. ఇక వెంకటేష్ – నీరజ దంపతులకు ముగ్గురు కుమార్తెల తర్వాత ఓ కుమారుడు జన్మించారు.