తెలుగులో ద బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘ బిగ్ బాస్ ‘ ప్రేక్షకుల్లో ఎంతగానో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే 6 సీజన్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించిన ఈ రియాలిటీ షో ఇటీవల 7 సీజన్లోకి అడుగుపెట్టబోతుందంటూ ఒక వీడియో ప్రోమో రిలీజ్ చేశారు ‘ బిగ్ బాస్ ‘ టీం. ఇక ” బిగ్ బాస్ 7 ” కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించబోతున్నాడు. మరోసారి నాగార్జున ఈ బిగ్గెస్ట్ తెలుగు రియాల్టీ షోను హోస్ట్ చేయడం కన్‌పార్మ్ అయ్యింది.
ఇప్పటికే ఈ సీజన్‌లో పాల్గొనే కంటిస్టెంట్ల లిస్ట్ తయారైపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వారిలో ఓ సెలబ్రిటీ జంట పాల్గొంటున్నారట. ఇప్పటికే తెలుగు సీరియల్స్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆ జంట అమర్‌దీప్ – తేజస్విని కావడం విశేషం. వీరిద్దరు జంటగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నారంటూ సమాచారం.
‘ జానకి కలగలేదు ‘ సీరియల్లో రామ్ గా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అమర్‌దీప్. అలాగే తేజస్విని కూడా ‘ కేరాఫ్ అనసూయ ‘ సీరియల్ లో హీరోయిన్గా నటిస్తుంది. దాంతోపాటే కొన్ని కన్నడ టీవీషోలలో కూడా కనిపించింది. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ జంట బిగ్ బాస్‌కు వెళితే కచ్చితంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.
ఇప్పుడు ఈ జంట గురించే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికి గతంలో బిగ్ బాస్ షో లో పాల్గొన్న అరియానా, సోహెల్ మంచి స్నేహితులు కావడం విశేషం. ఈ జంట వారి ప్రేమ పెళ్లిలో కీలకంగా వ్యవహరించారు. దీంతో అమర్దీప్ – తేజస్విని బిగ్ బాస్ కు వెళితే ఈ జంట సపోర్ట్ వారికి గట్టిగా ఉంటుందన్నడంలో సందేహం లేదు.