టాలీవుడ్ జ‌నాల‌కు స‌మంత ఎంత లైట్ అయిపోయిందంటే.. ప‌డిపోయిన ఆమె క్రేజ్‌కు ఇదే సాక్ష్యం..!

స‌మంత అంటే టాలీవుడ్ ఒక‌ప్పుడు నెత్తిన పెట్టుకునేది. సినిమా ఇండ‌స్ట్రీయే కాదు.. సినీ ల‌వ‌ర్స్ కూడా స‌మంత సినిమా కోసం ఎగ‌బ‌డేవారు. స్టార్ హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా స‌మంత కాల్షీట్ల కోసం కోట్ల‌కు కోట్లు కుమ్మ‌రించేవారు. అలాంటి స‌మంత అక్కినేని నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకుని సినిమాలు చేస్తున్న‌ప్పుడు కూడా ఆమె క్రేజ్ త‌గ్గలేదు.

ఎప్పుడు అయితే స‌మంత చైతుకు విడాకులు ఇచ్చేసిందో అప్ప‌టి నుంచి స‌మంత గ్రాఫ్ ప‌డుతూ ప‌డుతూ వ‌చ్చి చివ‌ర‌కు పాతాళానికి ప‌డిపోయింది. విడాకుల త‌ర్వాత స‌మంత రెచ్చిపోయి మ‌రి విచ్చ‌ల‌విడిగా అందాలు ఆర‌బోసేసింది. పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్‌పై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత సీటాడెల్ వెబ్ సీరిస్‌లో కూడా హాట్ సీన్ల‌లో చేసేందుకు ఓకే చెప్పింది.

అయితే ఇప్పుడు ఆమె ఎంత ఖాళీగా ఉన్నా… పెద్ద హీరోల సినిమాల‌కు హీరోయిన్లు లేక‌పోయినా ఆమె వైపు మాత్రం ఎవ్వ‌రూ క‌న్నెత్తి చూడ‌డం లేదు. మొన్న మ‌హేష్ సినిమాలో హీరోయిన్ పోస్టు ఖాళీ అయినా అస‌లు స‌మంత పేరే ప‌రిశీల‌న‌లోకి తీసుకోలేదు. ఆ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా చేస్తున్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా మార్చేశారు.

అంత‌కుముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా హీరోయిన్ విష‌యంలోనూ పూజాహెగ్డే కోసం ట్రై చేసి శ్రీలీల‌ను తీసుకున్నారే కాని స‌మంత‌ను తీసుకోలేదు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ దేవ‌ర హీరోయిన్ కోసం, రామ్‌చ‌ర‌ణ్‌, బ‌న్నీ సినిమాల కోసం ఎంద‌రో హీరోయిన్ల‌ను వెతుకుతున్నారు.. ఎంతో టైం తీసుకుంటున్నారు. అయినా స‌మంత‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.

అయితే మిడిల్ రేంజ్ హీరోలు, పెద్ద‌గా స్టార్ హీరోలు కానివారే ఇప్పుడు స‌మంత వెన‌కాల ప‌డుతున్నారు. అంత‌కు మించి ఆమెకు పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు రావ‌డం లేదు. కేవ‌లం స‌మంత ఛ‌రిష్మా, క్రేజ్ త‌గ్గిపోవ‌డంతోనే టాలీవుడ్ ఆమెను లైట్ తీస్కొంటోంద‌ని గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి.