ఎస్.. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరో కొడుకుకి తల్లి మత్తు పదార్థాలను అలవాటు చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా కొడుకే చెప్పడంతో ఇంతకీ ఎవరా స్టార్ హీరో కొడుకు..? ఏంటా మత్తుపదార్థాలు ? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. అతడే జాడెన్ స్మిత్.. ఈ పేరుని తెలుగు వారు గుర్తుపట్టకపోవచ్చు. అయితే పాపులర్ హాలీవుడ్ హీరో వీల్స్ – జాడ్ పింక్లెట్ దంపతుల కుమారుడు అని చెబితే హాలీవుడ్ సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులు కొంతమంది గుర్తిస్తారు.
యువకుడైన జాడెన్ ఇటీవల ఒక పబ్లిక్ స్టేజ్ పై మాట్లాడుతూ తనకున్న మత్తు పదార్థాలు అలవాటు గురించి వివరించాడు. డెన్వర్‌లో జరిగిన సైకెడెలిక్ సైన్స్ మీట్లో మాట్లాడుతూ సైకేడెలిక్స్ అనే నిషిద్ధ పదార్థాన్ని తాను అలవాటు చేసుకున్నాను అని.. దానికి తన తల్లి కారణమని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల తన జీవితంలో కొన్ని టాప్ సిచ్యువేషన్లు కూడా ఈజీగా ఎదుర్కొన్నానని.. దీని ప్రభావం నిజంగానే నాకు షాక్ ని కలిగించిందని చెప్పాడు.
ఈ డ్రగ్స్ వల్ల తన అహంకారాన్ని పూర్తిగా కోల్పోయానని చెప్పిన జాడెన్ ఈ మత్తు పదార్థాలని తన చిన్నప్పటి నుంచి స్నేహితులతో కలిసి వండుకొని మరి తీసుకుంటున్నా అని… అది పెద్ద విషయం కాదని వెల్లడించాడు. స్మిత్ కుటుంబం సైకెడెలిక్స్ను ఉపయోగించడం అనేది రహస్యం కాదు. ఇప్పటికే ఇది హాలీవుడ్ మ్యాగజైన్లో లెక్కలేనన్నిసార్లు కథనాలుగా వచ్చింది. జాడ్ పింక్లెట్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ మత్తు పదార్థంతో తకి, తన భాగస్వామికి ఉన్న అనుభవాలను చెప్పుకొచ్చింది. అలవాటు వల్ల ఉండే ప్రయోజనాలు కూడా చెప్పింది.
ఇక జాడెన్ స్మిత్ ఆ వేదికపై మాట్లాడుతూ తన ఇద్దరు సోదరులైన బిల్లు, సవతి సోదరుడు.. ట్రే తో తను నిరంతరం గొడవ పడుతూ ఉండేవాడినని.. తనకు తల్లి అలవాటు చేసిన మత్తు పదార్థాలు వల్లే ఈగో పోయిందని జాడెన్ తెలిపాడు. సైకెడెలిక్స్ తనను ఎంతగానో మార్చేసిందని తనలో డిప్రెషన్ తగ్గించిందని జాడన్ చెప్పుకొచ్చాడు. అయితే నెటిజన్లు మాత్రం కన్న తల్లే కొడుక్కి ఈ డ్ర… అలవాటు చేయడం మాత్రం విడ్డూరంగా ఉందంటున్నారు.