కొత్త ఇల్లు కొన్న హిమజ.. ఎన్ని కోట్లు తెలుసా.. పాప బాగా రిచ్..!

టాలీవుడ్ యాక్టర్స్ అయిన‌ హిమజ బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో… తన కట్టుబొట్టుతో ప్రేక్షకులను అల‌రించింది. వెండితెరపై కూడా అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది హిమజ. నేను శైలజ అనే సినిమాతో వెండితెరపై కమెడియన్ రోల్ ప్లే చేసిన హిమజ ఆ తరువాత చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొన్న హిమజ తన అల్ల‌రి చిల్ల‌రి చేష్ట‌ల‌తో మరింత క్రేజ్ తెచ్చుకుంది.

Himaja: Himaja's dream came true.. the actress landed in a four-storey new house

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతోంది. బిగ్ బాస్ షో తర్వాత వరుస ఛాన్సులను దక్కించుకున్న హిమజ సినిమాల్లోనే కాక‌, ఈవెంట్స్, కమర్షియల్ ప్రమోషన్స్ ఇలా అన్నింటిలో పాల్గొంటూ కోట్లలో సంపాదిస్తోంది. ఇప్పటికే రెండు కార్లు కొన్న హిమజ ఇటీవల నాలుగు అంతస్తుల ఇళ్లు కట్టుకొని అందులోకి అడుగు పెట్టింది. హిమజ కట్టుకున్న ఆ ఇంటి ఖరీదు దాదాపు రూ. 50 లక్షలు విలువ చేస్తుందట‌.

హిమ‌జ‌ తన గృహప్రవేశం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లక్ష్మీదేవి ఫోటో పట్టుకుని కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేస్తూ ఫోటో దిగిన హిమజ ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గృహప్రవేశం.. జ్ఞాపకాల కోసం నిర్మించుకున్న ప్రదేశం.. నా కొత్త ఇళ్లు.. నా కలలు సాకారం అయ్యాయి.. ఈ మైలురాయిని దాటినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను నేనే ప్రశంసించుకుంటున్నాను అని ఓ మెసేజ్ పెట్టుకుంది.

Bigg Boss Himaja Shares Her Dream House Construction Video - Sakshi

దీంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు చాలామంది బుల్లితెర నటినటులు కూడా ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. కొంద‌రు నెటిజ‌న్లు అయితే హిమ‌జ బాగానే సంపాదిస్తోంద‌ని… మొత్తానికి ఆమె రిచ్ కేట‌గిరిలోకి వెళ్లిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం హిమజ కొత్త ఇంటి వార్తలు, ఆ ఇంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.