ఇటీవల మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ మెగా డాటర్ నిహారిక పేరు ఒక రేంజ్ లో మారుమోగుతుంది. రీసెంట్ గా ఆమె తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో ఉన్న వివాహ బంధాన్ని తెంచేసుకుంది. వీరిద్దరూ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు తీసుకుని ఎవరిదారుల్లో వారు ముందుకు వెళుతున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలువురు ఆమెను ఒక రేంజ్ లో ఆటాడుకుంటున్నారు. అయితే నిహారిక మాత్రం తనపై వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా లైఫ్ లో ముందుకు వెళుతుంది. అలా విడాకులు వచ్చి వారం రోజులు అయ్యాయో లేదో వెంటనే ఆమె తన గ్లామర్ ప్రపంచంలోకి వెళ్లిపోయింది. తాజాగా ఆమె మాదాపూర్ లోని హెచ్ఐసీసీని ఆదివారం ప్రారంభించింది.
మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ హైలైఫ్ ఎగ్జిబిషన్‌లో ప్రోగ్రామ్‌లో నిహారికతో పాటు పలువురు సినీ నటీమణులు పాల్గొన్నారు. వీరిలో నిహారిక కొణిదెల, శాన్వీ మేఘన తదితరులు పాల్గొన్నారు. నూతన డిజైన్ల ఆభరణాలు, దుస్తులు ధరించి అక్కడ సందడి చేయడంతో పాటు పలువిరికి వీనులవిందు చేశారు.
రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలకు పోజులు ఇచ్చారు. అయితే చాలా మంది నెటిజన్లు మాత్రం విడాకులు వచ్చి వారం రోజులు అయ్యాయో లేదో అప్పుడు నీ ఎంజాయ్‌మెంట్, నీ సరదాలు మొదలు పెట్టేశావా ? నువ్వు ఈ లైఫ్ కోసమే నీ భర్తను కూడా వదిలేశావ్.. తర్వాత నీకు బాధలు తెలుస్తాయంటూ కామెంట్లు చేస్తున్నారు.