పవన్ కళ్యాణ్ “తమ్ముడు” సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే కళ్ళు తిప్పుకోలేరు..!!

ప్రీతి జింగానియా.. ముంబైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మొద‌ట మలయాళ, తమిళ సినిమాల్లో నటించింది. తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తమ్ముడు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రీతి. త‌ర్వాత‌ టాలివుడ్ లో బాల‌య్య హీరోగా న‌టించిన నరసింహనాయుడు సినిమాలో నటించి మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది.

ఆ తరువాత అధిపతి, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాలలో నటించింది. కొంతకాలం టాలీవుడ్ కి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి చిందేసింది. టాలివుడ్ లో ఛాన్సులు రాక‌పోవ‌డంతో టాలివుడ్‌కి దూరమైంది. తర్వాత హిందీ, కన్నడ, ఉర్దూ, మలయాళం, పంజాబీ ఇలా ఎన్నో భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో ఎక్కువ సినిమాల్లో నటించింది ప్రీతి.

2008లో పర్వీన్ నీ వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మెల్ల‌గా ఇండస్ట్రీకి దూరమైంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. 42 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ అందం ఏ మాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది ప్రీతి.