సీనియర్ నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవరసరం లేదు. ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. తెలుగు, తమిళం తదితర భాషల్లో అగ్ర హీరోల సరసన నటించి అమితమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అగ్ర కథనాయికగా వెలుగొందిన మీనా ప్రస్తుతం మంచి పాత్రలు చేస్తూ నటిగా పాపులర్ అవుతోంది. అయితే ఇటీవల ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో మరణించిన విషయం తెలిసిందే.
గతంలో మీనతో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ హీరోలు సైతం తమ డేట్స్ అడ్జస్ట్ చేసుకునేవారట.. అదే సమయంలో కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో తన తల్లి కారణంగా అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని వార్తలు కూడా ఉన్నాయి. ఇక అంతేకాకుండా మీనా తల్లి ప్రతి విషయాలలోనూ కండిషన్లు పెట్టేదట. ఈ కారణం చేత చాలామంది దర్శక నిర్మాతలు కూడా మీనాకు అవకాశలు ఇవ్వాలంటే భయపడే వారట.. ఇదే క్రమంలో ఓ స్టార్ హీరోని మీనా తల్లి స్టేజ్ పైన అందరూ చూస్తుండగా దారుణంగా అవమానించిందట.
మరి మీనా తల్లి ఆ హీరోని ఎందుకు అవమానించింది.. అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..నటి మీనా, అజిత్ కలిసి గతంలో ఆనంద పూంకట్రు అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో మంచి విజయం సాధించడంతో అజిత్ కు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా దక్కింది. ఈ సందర్భంగా ఓ వేదికపై అజిత్ కు మీనా అవార్డు ఇచ్చింది. ఇక ఆ శుభ సందర్భంలో.. అజిత్, మీనా కలిసి స్టేజ్ పై డ్యాన్స్ చేయాలంటూ హోస్ట్ కోరాడు.
ఇది విన్న మీనా తల్లి..స్టేజ్ మీదకి పరిగెత్తుకుంటూ వచ్చి మీనా చేయి పట్టుకొని స్టేజ్ కిందికి తీసుకువచ్చిందట అయితే ఈ విషయం అప్పట్లో ఎంతో సంచలనంగా మారింది.. అంతేకాకుండా చాలామంది సినీ పెద్దలు ఇండస్ట్రీ జనాలు అజిత్ ని పబ్లిక్ గా అవమానిస్తుంద ఆమెకు ఎంత పొగరు అంటూ కూడా ఆమెను తిట్టుకున్నారు.. ఆమె తీరుపై కొందరు నటులు తప్పుబట్టినట్లు వార్తలు కూడా వచ్చాయి.