తెలంగాణ రాజకీయాలో ఎంతో సంచలంగా మారిన ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రీసెంట్ గానే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు పొంగులేటి. పార్టీలో చేరిన దగ్గర్నుంచి కార్యకర్తలతో గ్రౌండ్ స్థాయిలో ప్రచారం ఇప్పుడే మొదలుపెట్టేసారు పొంగులేటి.. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.
అదేవిధంగా ఖమ్మం జిల్లాలో తన బలం ఏంటో చూపించాలని.. వచ్చే ఎన్నికల్లో తన సానుభూతిపరులను కూడా ఎక్కువమందిని అసెంబ్లీకి పంపాలని ఎంతో కష్టపడుతున్నారు. పొంగులేటి. ఈ విషయం ఇలా ఉంచితే తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా మారింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- విక్టరీ వెంకటేష్ ఇద్దరూ బ్రదర్స్ అవుతారట. ఈ విషయం ఎవరికీ ఇప్పటి వరకు పెద్దగా తెలియదు మరి ఇద్దరూ అన్నదమ్ములు ఎలా అవుతారో ఒకసారి చూద్దాం.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామసహాయం సురేందర్ రెడ్డి కారణంగానే పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. రామసహాయం సురేందర్‌రెడ్డి ఫ్యామిలీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన పట్టు ఉంది. వాళ్ల కుటుంబం నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీ తరపున చట్ట సభలకు ఎంపికయ్యారు. రామసహాయం సురేందర్ రెడ్డి కి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నాడు.
ఇక సురేందర్ రెడ్డి కొడుకు పేరు రఘురామరెడ్డి. ఇతనికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. వారిలో పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి.. ఈ వినాయక్ రెడ్డికి వెంకటేష్ కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు. అలాగే చిన్న కొడుకు అర్జున్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురుని పెళ్లి చేశారు. ఈ విధంగా వెంకటేష్- పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నదమ్ములుగా మారారు.