నిర్మాత వడ్డే రమేష్ కొడుకు నవీన్ కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు వడ్డే నవీన్. ఫ్యామిలీ నేపథ్యం ఉన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్.. కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన పెళ్లి సినిమా హిట్ కావడంతో స్టార్‌డంని సంపాదించుకున్నాడు.
ఈ సినిమా సక్సస్‌తో నవీన్ కెరీర్ మంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంది. కాని తర్వాత వచ్చిన సినిమాలేవి అనుకున్న రేంజ్ లో సక్సెస్‌కాలేదు. స్టోరీ సెలక్షన్ సరిగ్గా రాకపోవడం వల్లే ఇలా జరిగిందని కొందరు అంటే.. ప్రేమ పెళ్లి కారణమని మరికొందరు రూమర్స్ క్రియేట్ చేశారు. మొత్తానికి ఇండస్ట్రీలో సక్సెస్ లేక సినిమాలకు దూరమయ్యాడు నవీన్. దివంగత నటుడు నటరత్న ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కూతురిని నవీన్ వివాహం చేసుకున్నాడు.
నవీన్ తండ్రి వడ్డే రమేష్, ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చనువుతోనే ఎన్టీఆర్ తన మనవరాలితో నవన్ పెళ్లి జరిపించారు. కొంతకాలానికి ఏవో మనస్పర్ధలు కారణంగా ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత వడ్డే నవీన్ ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం నందమూరి కుటుంబమేనని.. నవీన్, రామకృష్ణ కూతురికి విడాకులు ఇవ్వడంతో నందమూరి కుటుంబం ఆగ్రహానికి గురై ఇండస్ట్రీ అతన్ని పక్కన పెట్టేసేలా చేసిందని చెప్తూ ఉంటారు.
అయితే ఇదంతా అబద్ధం… ఆ విడాకుల తర్వాత కూడా నవీన్ చాలా యేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగాడు.
ఇక నవీన్ ఇండస్ట్రీకి దూరమై 10 సంవత్సరాలైనా ఇంకా సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వలేదు. రామకృష్ణ కూతురికి విడాకులు ఇచ్చిన కొంతకాలానికి నవీన్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న వడ్డే నవీన్ రియల్ లైఫ్ లో ఎంతో హ్యాపీగా గడుపుతున్నాడు. ఇకనైనా వడ్డే నవీన్ ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇస్తే బాగుండని నవీన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.