టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.. రాజస్థాన్ లోని పురాతన ప్యాలెస్ ఈ పెళ్లికి వేదిక అయింది.. ఈ ఏడాది మొదట్లోనే శర్వానంద్ రక్షిత రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.. శర్వానంద్ ఎంగేజ్మెంట్ చేసుకున్న రక్షిత రెడ్డి మరి ఎవరో కాదు ప్రముఖ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె.. వీరిది పెద్దలు కుదుర్చిన వివాహంగా తెలుస్తుంది.
ఇక నిన్నటి నుంచి వీరి పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా మొదలవ్వగా.. నిన్న ఎంతో ఘనంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించారు.. ఈ కొత్త జంట హల్ది వేడుకల్లో ఎంతో ఆనందంగా మునిగితేలారు. ఈ హెల్ది వేడుకలకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ లో జరుగుతున్న వీరి వివాహానికి వారికి అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తుంది. వివాహం తర్వాత హైదరాబాదులో జరిగే భారీ రిసెప్షన్ కి టాలీవుడ్ ప్రముఖులందరూ హాజరుకానున్నారని ఒక వార్త వైరల్ గా మారింది.
ఇదే విధంగా ఈరోజు రాత్రి 11.30 నిమిషాలకు వేద మంత్రాల సాక్షిగా ఈ కొత్త జంట వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నారు. ఇక శర్వానంద్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఆయన ఉన్నత ఫ్యామిలీ నుంచి వచ్చారు.. వీరి కుటుంబానికి హైదరాబాదులో పాటు ఎన్నో నగరాలలో భారీ ఆస్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.. శర్వానంద్ ఆస్తి కొన్ని వందల కోట్ల ఉంటుందని సమాచారం.. ఇక రక్షిత రెడ్డి వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్.. వీరి కుటుంబానికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది.. మాజీమంత్రి దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వీరి తాత.
శర్వానంద్ తన సినీ కెరీర్‌ను సపోర్టింగ్ రోల్స్ ద్వారా మొదలుపెట్టి.. గమ్యం, ప్రస్థానం సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు, రన్ రాజా రన్ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ పెంచుకున్నాడు.. ఈ సినిమా తర్వాత శతమానం భవతి, మహానుభావుడు వంటి వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయలను అందుకున్నీ మీడియం రేంజ్ హీరోగా సెట్ అయ్యాడు. రీసెంట్ గా మాత్రం ఆయన కెరియర్ కొంచెం నెమ్మదించింది శర్వానంద్‌కు భారీ కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో అయినా మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.