స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ – నితిన్ కాంబినేష‌న్లో మిస్ అయిన సూప‌ర్ హిట్ ఇదే…!

స్టార్ ప్రొడ్యూసర్ అండ్ నైజాంలో టాప్‌ డిస్ట్రిబ్యూటర్ తండ్రి సుధాకర్ రెడ్డి బ్యాగ్రౌండ్‌తో సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగు పెట్టాడు నితిన్. తన మొదటి సినిమా జ‌యం సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నటించిన దిల్ దాని తర్వాత వచ్చిన సై సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆ టైంలో నితిన్ కాల్షీట్లు దొర‌క‌డ‌మే క‌ష్టంగా మారింది.

అంత క్రేజ్ వ‌చ్చినా తర్వాత సరైన ప్లానింగ్ లేకపోవ‌డ‌మో లేదా నితిన్ లక్ బోల్తా పడ‌డ‌మో తెలియదు కానీ వరుసగా 12 డిజాస్టర్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. నితిన్ ఒక్కడే దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు, స్టార్ డైరెక్ట‌ర్లు అందరితో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వి. వి. వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, కృష్ణవంశీ ఇలా వరుసగా టాప్ స్టార్ డైరెక్టర్స్ అందరితో నటించినా నితిన్ ల‌క్ బాగోక‌ మీడియం రేంజ్ హీరోగానే మిగిలిపోయాడు.

నితిన్ తన సిని కెరియర్లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. తాజాగా నితిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీరు ఎప్పుడైనా వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉండి సినిమా వదులుకొని బాధ‌ప‌డ్డ సంద‌ర్భాలు ఉన్నాయా ? అన్న ప్ర‌శ్న‌కు ఇంట్ర‌స్టింగ్ ఆన్స‌ర్ ఇచ్చాడు. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో బాయ్స్ సినిమాలో నటించే అవకాశం వచ్చింద‌న్న విష‌యం బ‌య‌ట పెట్టాడు.

అదే టైంలో తాను తేజ ద‌ర్శ‌క‌త్వంలో జయం సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో డేట్స్ స‌ర్దుబాటు చేయ‌డం కుదరక ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని.. ఆ సినిమా వదులుకున్నందుకు ఓ మంచి సినిమాని మిస్ అయ్యానే అని బాధప‌డ్డాను అంటూ చెప్పుకొచ్చాడు నితిన్.