స్టార్ హీరో గోపీచంద్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మొదట విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన గోపీచంద్ తర్వాత చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సూపర్ సక్సెస్ఫుల్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న గోపీచంద్ తన సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఓ స్టార్ హీరోయిన్ ప్రాణంగా ప్రేమించాడట. కానీ ఆమెను పెళ్లి చేసుకోలేకపోయాడు. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరోయిన్? ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అనుకుంటున్నారా..!
ఆమె ఎవరో కాదు ట్రెడిషనల్ బ్యూటీ స్నేహ. గోపీచంద్ ఇండస్ట్రీకి ‘ తొలివలపు ‘ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్గా స్నేహ నటించింది. గోపీచంద్ స్నేహాని చూసిన మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడట. ఆమెని ఎలాగైనా వివాహం చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యాడట. స్నేహకి ఎలాగైనా తన ప్రేమ విషయం చెప్పి వివాహం చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యాడట.
ప్రపోజ్ చేయాలి అన్న టైంలో స్నేహ వేరే వ్యక్తుల దగ్గర గోపీచంద్ నాకు అన్నయ్య లాంటి వాడన్న సంకేతాలు వ్యక్తం చేసిందట. దీంతో గోపీచంద్ చాలా ఫీలయ్యాడని తను నన్ను అన్నయ్యలా ఫీల్ అవుతుంది.. ఇలాంటి టైం లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఆమెకు నాపై మరో ఇంప్రెషన్ పడుతుంది అన్న ఉద్దేశంతో గోపీచంద్.. స్నేహకి ప్రపోజ్ చేయకుండా ఆగిపోయాడట.
ఇక గోపీచంద్ – రష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. రష్మి సీనియర్ హీరో శ్రీకాంత్ మేనకోడలు కావడం విశేషం. అంతకు ముందే గోపీకి మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగాక క్యాన్సిల్ అయ్యింది. ఇక గోపీచంద్ – రష్మి జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గోపీచంద్ తన కుటుంబంతో లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.