1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమదేశం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అబ్బాస్. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన అబ్బాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న అబ్బాస్ యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించాడు.
ఇండస్ట్రీలో ఎంత త్వరగా సక్సెస్ సాధించాడో.. అంతే త్వరగా డిజాస్టర్ చూశిన అబ్బాస్ హీరోల జాబితాలో యాడ్ అయిపోయాడు. సినిమాలకు గుడ్ బై చెప్పి తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యాడు. అక్కడ అబ్బాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అబ్బాస్ భార్య పేరు ఇరుము ఆలీ. 2001 లో ఈ జంట వివాహం చేసుకున్నారు. అబ్బాస్ భార్య ఇరుము అలి కూడా ఒక నటి అన్న విషయం చాలామందికి తెలియదు.
బాలీవుడ్ లో అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ఫ్యాషన్ డిజైనర్ కూడా. అబ్బాస్ నటించిన చాలా సినిమాలకు ఇమె ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరించింది. ఈ జంటకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు పేరు ఏమిరా అలీ. తల్లిదండ్రులను మించిన అందం ఈమె సొంతం ఆమెను చూసిన చాలా మంది నెటిజన్స్ హీరోయిన్స్ కూడా ఏమేముందు పనికిరారు అన్ని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె సోషల్ మీడియాలో ప్రైవేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంది. అయినా ఈమె ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అబ్బాస్ ఫ్యాన్స్ ఈమె కూడా ఇండస్ట్రీ లోకి అడుగు పెడితే స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఏమిరా అలీ కి నటనపై ఇంట్రెస్ట్ లేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నత చదువుల పైన దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ.