క్యాస్టింగ్ … అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ సంచలనం అయిపోయింది. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు, బుల్లితెర నటీమణులు కూడా తమ కెరీర్‌లో తాము ఎదుర్కొన్న లైం… వేధింపుల గురించి ఓపెన్ అవుతున్నారు. గత ఆరేడేళ్ల నుంచి ఇది బాగా పాపులర్ అవుతోంది. ఈ లిస్టులో చాలా మంది సీనియర్ హీరోయిన్లు కూడా యాడ్ అవుతున్నారు.
తమ కెరీర్ ప్రారంభంలో లేదా ఏదో ఒక టైంలో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలోనో లేదా యూట్యూబ్ ఇంటర్వ్యూల్లోనే చెపుతున్నారు. విచిత్రం ఏంటంటే బాలీవుడ్ సీనియర్ నటీమణి హేమమాలిని కూడా తాను ఓ డైరెక్టర్ తీరుతో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం ఇప్పుడు చెప్పడం సంచలనంగా మారింది.
గతంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ తన చీరకు ఉన్న పిన్ తీసేయాలని చెప్పినట్టు ఆమె తెలిపారు. ఆ మాటతో తాను పెద్ద షాక్‌కు గురయ్యానని.. డైరెక్టర్ నా మీద ఓ బో.. సీన్ షూట్ చేయాలనుకున్నారు… నా చీర పిన్ తీసేస్తే నా పైట జారిపోతుందని తాను చెప్పానని.. అప్పుడు ఆ డైరెక్టర్ మాకు అదే కదా కావాల్సిందని అన్నట్టు ఆమె చెప్పారు.
ఆ డైరెక్టర్ తీరుతో తాను ఇబ్బంది పడినా కూడా ఆ షాట్ పూర్తయ్యేందుకు దర్శకుడు చెప్పిన విధంగా చేసినట్టు ఆమె గుర్తు చేసుకున్నారు. ఇక హేమమాలిని 1960వ దశకంలో బాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్. ఆమె సీనియర్ నటుడు ధర్మేంద్రకు భార్య. తెలుగులో ఆమె చాలా రోజుల తర్వాత బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో బాలయ్యకు తల్లిగా నటించారు.