హార్ట్‌ఎటాక్‌ని ముందుగా గుర్తించడం ఎలా.. స్పాట్‌లో ఫ‌స్ట్ ఇలా చేస్తే సేఫే..!

చాలామంది గుండె నొప్పి వచ్చినా గ్యాస్ నొప్పి అనుకోని ఏదో టాబ్లెట్ వేసుకుంటారు. గుండె నొప్పి లక్షణాలపై అవగాహన లేక ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటారు. గుండెపోటు లక్షణాలు, నివారణ, గుండెపోటు వస్తే తక్షణం చేయాల్సిన పనులు ఏంటో ఒకసారి చూద్దాం. రొమ్ము భాగంలో ఆకస్మికంగా నొప్పి వచ్చినప్పుడు మామూలుగా వచ్చే నొప్పితో పోలిస్తే గుండెనొప్పి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

దీంతోపాటు ఎడమ చేయి లాగుతుంది అంటే అది గుండెపోటు లక్షణమే. జలుబు, ఫ్లూజ్వ‌రం వస్తూ తగ్గుతూ ఉన్నా.. జ్వరం వచ్చి చాలా కాలం వరకు తగ్గకపోయినా అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వస్తుందనడానికి సూచనలు. దీంతో పాటే దగ్గు ఎక్కువగా రావడం, శ్వాసలో ఇబ్బంది కలగడం, హార్ట్ ఎటాక్ సూచనలుగా అనుమానించాలి. ఛాతిలో అసౌకర్యంగా అనిపించి.. బరువుగా అనిపిస్తే అది హార్ట్ ఎటాక్ సూచనే అవుతుంది.

ఇలా అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లడం మంచిది. మత్తుమత్తుగా అనిపించి నిద్ర వస్తున్నట్లు అనిపించినా.. తరచూ ఒళ్లు నొప్పులు వచ్చి శరీరం అలిసిపోయినా.. ఇవి గుండెపోటు సూచనలే అవుతాయి. అలాంటి లక్షణాలను అశ్రద్ధ చేయవద్దు. కాళ్లు, పాదాలు, మడమలు ఉబ్బ‌డం.. గొంతు నొప్పి, దవడాల నొప్పులను కూడా అశ్రద్ధ చేయవద్దు. గుండె ఎక్కువసార్లు కొట్టుకున్న హార్ట్ ఎటాక్ లక్షణమే. తరచుగా హార్ట్ బీట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి.

గుండెపోటుకు చేయవలసిన ప్రథమ చికిత్స..
గ్లాసు నీరు తాగించాలి. కొన్నిసార్లు వెంటనే ఈసీజే తీసే సమయం ఉండకపోవచ్చు పరిస్థితి విషమంగా అనిపిస్తే పడుకోబెట్టి లేదా కూర్చోబెట్టి డిస్పిరిన్ 300 మి.గ్రా మాత్ర నీటిలో కలిపి తాగించాలి. ఆ తర్వాత సార్బిట్రేట్ మాత్రం కూడా వేయాలి. దీంతో నొప్పి వెంటనే తగ్గుతుంది. నొప్పి తగ్గిన వెంటనే హాస్పిటల్ కి సాధ్యమైనంత త్వరగా తీసుకొని వెళ్ళాలి. ఆ వ్య‌క్తి టైట్ ఫిట్ వేసిన‌ట్లైతే లూస్ చేయాలి. అవసరమైతే నోటితో శ్వాస అందించడం, ఛాతిపై రెండు చేతులతో గట్టిగా నొక్కడం క్ర‌మ ప‌ద్ద‌తిలో చేయాలి.