వర్షాకాలంలో ఈ ఐదు కూరగాయల‌తో హెల్త్‌కే డేంజ‌రే… !

వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు. వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించకపోతే అంటువ్యాధులను తెచ్చిపెడుతుంది. కాస్త నిర్లక్ష్యంగా ఉన్న ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ వాతావరణం లో సూక్ష్మ‌జీవుల‌ పెరుగుదల బాగా ఉంటుంది. దీనితో జీర్ణ సమస్యలు మొదలవుతాయి. ఈ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని కాపాడేది మనం తీసుకునే ఆహారమే.

ఆహారాన్ని డైట్ పేరుతో తక్కువగా తీసుకోవడం సరైన ఆహారం తినకపోవడం లాంటి పనులు చేస్తే అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్ లకు దారితీస్తుంది. వర్షాకాలంలో తీసుకోకూడని ఆహారం కూడా ఉంది. ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, బచ్చలికూర వంటి కూరగాయలు జీర్ణ ఆహారాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం మాత్రం వాటి జోలికి వెళ్లకూడదు.

లౌకి, టోరీ వంటి ఇతర తేలికపాటి ఆహారాన్ని సమర్థవంతమైన జీర్ణ క్రియ కోసం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్ళల్లో తేనె కలుపుకుని తాగాలి, ఇంటిలో తయారుచేసిన తాజా భోజనం తినాలి, అల్లం వండుకునే కూరల్లో చేర్చుకోవాలి, పచ్చి సలాడ్, పెరుగు, లాంటి పదార్థాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్, లాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఎటువంటి అనారోగ్యం రాకుండా మన చుట్టూ ఉన్న పరిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి.

వర్షాకాలంలో తినకూడని ఆహారం
1.బెల్ పెప్పర్స్:
బెల్ పెప్పర్స్ లేదా సిమ్లా మిర్చ్ క్రిస్పీ స్టార్టర్స్ , నూడిల్స్ నుండి స్టైల్ ప్రైస్, కూరల వరకు అనేక రకాల వంటలలో దీనిని ఉపయోగిస్తారు. జలుబు, జీర్ణసంబంధమైన మంట, లాంటి సమస్యలకు గురిచేస్తుంది. ఈ కాలంలో ఉబ్బరం సమస్యలకు దూరంగా ఉండాలంటే బెల్ పెప్పర్స్ వాడ‌కూడ‌దు.

2.పాలకూర:
పాలకూర, బచ్చలకూర వర్షాకాలంలో అసలు తినకూడదు. ఎందుకంటే బచ్చలికూర వల్ల జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇది గ్యాస్ట్రో ఇంటెక్షనల్ ఇన్ఫెక్షన్ , జీర్ణక్రియ సమస్యలను కలిగించడమే కాదు, మన ఆరోగ్యానికి ఇది ప్రమాదం కూడా.

3.కాలీఫ్లవర్:
ఆలూ గోబీ, గోపి పరాథే, గోబీ పకోడీ లాంటి ఆహారం వర్షం పడేటప్పుడు తినాలనిపిస్తుంది. కానీ ఇవి తినడం వల్ల శితలీకరణ, నీటి స్వభావం జీర్ణ క్రియకి ఆటంకం కలిగిస్తాయి.

4.క్యాబేజీ:
సలాడ్, స్టైల్ ప్రైస్, నూడిల్స్ నుండి అనేక స్ట్రీట్ ఫుడ్స్ వరకు, క్యాబేజీ ఒక ప్రసిద్ధ భారతీయ కూరగాయ. ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో దీనిని తినకపోవడమే మంచిది. ఇది తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.

5.టొమాటొలు:
సలాడ్, సూప్, టమాటో సాస్, ఇలాంటివి వర్షాకాలంలో ఎసిడిటీని కలిగిస్తుంది. కాబట్టి వాటిని వాడకపోవడమే మంచిది. వాటి వేడి, పుల్లని లక్షణాలు అనారోగ్యానికి గురిచేస్తాయి.